రూలర్ ఎవరు..?

Posted By: Prashanth

రూలర్ ఎవరు..?

 

గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతోంది. తాజా పరిస్థితులను పరిగణంలోకి తీసుకుంటే పెద్ద డిస్‌ప్లే కలిగిన స్మార్ట్‌ఫోన్‌లకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ఈ నేపధ్యంలో ఆండ్రాయిడ్ ఆధారితంగా స్పందించే రెండు పెద్ద‌స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌ల మధ్య పోటీ ఏర్పడింది. ఈ డివైజ్‌లలో మొదటిది ‘గెలాక్సీ ఎస్3’ కాగా మరొకటి ఎల్‌జీ ‘నెక్సస్ 4’. ఇండియన్ మార్కెట్లో వీటి అందుబాటు విషయానికొస్తే గెలాక్సీ ఎస్3 (16జీబి వర్షన్) ధర రూ.34,900. ఎల్‌జీ నెక్సస్ 4 విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఈబే డాట్ ఇన్ (eBay.in) నెక్సస్ 4 ముందస్తు బుకింగ్‌లను స్వీకరిస్తుంది. ఈ నేపధ్యంలో రెండు గ్యాడ్జెట్ల స్పెసిఫికేషన్‌లపై తులనాత్మక అంచనా....

బరువు ఇంచా చుట్టుకొలత......

ఎల్‌జి నెక్సస్ 4: చుట్టుకొలత 134.2 x 68.6 x 9.1మిల్లీ మీటర్లు, బరువు 139 గ్రాములు,

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 : చుట్టుకొలత 136.6 x 70.6 x 8.6మిల్లీ మీటర్లు, బరువు 133 గ్రాములు,

డిస్‌ప్లే......

ఎల్‌జి నెక్సస్ 4: 4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్,

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3: 4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,

ప్రాసెసర్.....

ఎల్‌జి నెక్సస్ 4: క్వాడ్ కోర్ 1.5గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో ప్రాసెసర్ (ప్రత్యేతకలు సుధీర్ఘ బ్యాటరీ లైఫ్, ప్రభావితమైన మల్టీ టాస్కింగ్, స్మూత్ గేమింగ్ ప్లే, స్టన్నింగ్ గ్రాఫిక్స్, అత్యుత్తమ 3డి అనుభూతులు),

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3: ఎక్సినోస్ 4412 క్వాడ్ చిప్‌సెట్ (తక్కువ పవర్ ఖర్చు, ఉన్నతమైన 3డి పనితీరు),

ఆపరేటింగ్ సిస్టం....

ఎల్‌జి నెక్సస్ 4: ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేకతలు: ఫోటో స్పియర్ కెమెరా, గెస్ట్యర్ టైపింగ్, మిరాకాస్ట్, డేడ్రీమ్, మెరుగుపరచబడిన నోటిఫికేషన్స్, క్విక్ సెట్టింగ్స్),

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3: ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్),

కెమెరా.....

ఎల్‌జి నెక్సస్ 4: 8 మెగా పిక్సల్ రేర్ కమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, జియో ట్యాగింగ్, టచ్ ఫోకస్, ఫేస్ డిటెక్షన్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, జియో ట్యాగింగ్, టచ్ ఫోకస్, ఫేస్ డిటెక్షన్), 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

స్టోరేజ్......

ఎల్‌జి నెక్సస్ 4:2జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ వర్షన్స్ 16జీబి, 32జీబి, 64జీబి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3: 2జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ వర్షన్స్ 8జీబి, 16జీబి.

కనెక్టువిటీ.....

ఎల్‌జి నెక్సస్ 4: వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ 2.0,

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3:వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ 2.0,

బ్యాటరీ......

ఎల్‌జి నెక్సస్ 4: 2100ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ (15.3గంటల టాక్‌టైమ్, 390 గంటల స్టాండ్‌బై),

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3: 2100ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (11.5గంటల టాక్‌టైమ్, 790 గంటలు స్టాండ్‌బై),

ధర......

ఎల్‌జి నెక్సస్ 4: 8జీబి వర్షన్ ప్రీఆర్డర్ ధర రూ.23,490, 16జీబి వర్షన్ ప్రీఆర్డర్ ధర రూ.27,490.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3: 8జీబి వర్షన్ ధర రూ.34,800, 16జీబి వర్షన్ ధర రూ.41,500.

తీర్పు: ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ జెల్లీబీన్ అనుభూతులతో పాటు వేగవంతమైన ప్రాసెసింగ్ అలాగే సుధీర్ఘమైన బ్యాటరీ బ్యాకప్‌ను కోరుకునే వారికి నెక్సస్ 4 ఉత్తమ ఎంపిక. ఉత్తమ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, అత్యుత్తమ సాఫ్ట్‌వేర్ ఫీచర్‌లను ఆస్వాదించాలనుకునే వారికి గెలాక్సీ ఎస్3 బెటర్ ఆప్షన్.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot