అక్టోబర్ 3న మార్కెట్లోకి లాంచ్ కానున్న LG 5 కెమెరాల ఫోన్

కొరియా ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ దిగ్గజమైన LG సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్‌ 3న మార్కెట్‌లోకి విడుదల చేయబోతుంది.

|

కొరియా ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ దిగ్గజమైన LG సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్‌ 3న మార్కెట్‌లోకి విడుదల చేయబోతుంది. ఆ స్మార్ట్‌ఫోన్‌ లాంచింగ్‌కు సంబంధించిన ఈవెంట్‌ ఇన్విటేషన్లను మీడియాకు కూడా పంపిస్తోంది. LG V40 ThinQ పేర్కొంది. ఈ డివైజ్‌కు చెందిన వీడియోను తన అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌లో పొందుపరిచింది. 30 సెకన్లలో ఈ లాంచ్‌ వీడియో థీమ్‌, కెమెరా సెటప్‌. అంటే ఆ వీడియోలో LG V40 ThinQ కెమెరా సెటప్‌ను రివీల్‌ చేసింది .ఈ ఫోన్ మొత్తం ఐదు కెమెరా లెన్సస్‌ను ఇది కలిగి ఉంది.వెనుక వైపు మూడు, ముందు వైపు రెండు కెమెరాలున్నాయి.

ఇంట్లో ఇల్లాలు వాట్సప్‌లో ప్రియురాలు... చివరికి ఏమైందంటేఇంట్లో ఇల్లాలు వాట్సప్‌లో ప్రియురాలు... చివరికి ఏమైందంటే

కెమెరా ప్రత్యక ఆకర్షణ....

కెమెరా ప్రత్యక ఆకర్షణ....

ప్రైమరీ కెమెరా ఎల్‌జీ ట్రేడ్‌మార్క్‌ ఫీచర్‌ మెయిన్‌ లెన్స్‌తో వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ను కలిగి ఉంది. పోర్ట్రెయిట్ మోడ్‌కు ఇటీవల డిమాండ్‌ బాగా పెరుగుతుండటంతో, ఎల్‌జీ మూడో లెన్స్‌ను ఈ విధంగా రూపొందించింది. ఈ ఫోన్‌కు సంబంధించిన మిగతా వివరాలు అక్టోబర్‌ 3న రివీల్‌ కానున్నాయి

లాంచింగ్‌ ఈవెంట్‌...

లాంచింగ్‌ ఈవెంట్‌...

అమెరికాలోని న్యూయార్క్‌లో దీని లాంచింగ్‌ ఈవెంట్‌ జరగనుంది. వెంటనే అక్టోబర్‌ 4న రెండో లాంచ్‌ ఈవెంట్‌ను దక్షిణ కొరియా సియోల్‌లో నిర్వహించబోతుంది.

గతంలో LG సంస్థ టీజర్ ను  విడుదల చేసింది....

గతంలో LG సంస్థ టీజర్ ను విడుదల చేసింది....

గతంలో LG సంస్థ వివిధ కన్ఫిగరేషన్లతో మూడు లెన్స్ను చూపించే టీజర్ ను విడుదల చేసింది. అయితే తాజా వీడియో లో ఆ విషయం కన్ఫర్మ్ అయింది . 30 సెకనుల వీడియో LG V40 ThinQ లో సాఫ్ట్ -టచ్ మెటీరియల్ వినియోగాన్ని కూడా ప్రదర్శిస్తుంది. LG వారి ప్రధాన స్మార్ట్ఫోన్ వెనుక ప్యానెల్లో ఒక కొత్త సాఫ్ట్ టచ్ మెటీరియల్ ని అమలు చేస్తుంది.ఈ ఫోన్ LG సంస్థ నుంచి ప్రత్యేక ఎడిషన్ గా మార్కెట్లోకి రాబోతుంది.

LG V సిరీస్....

LG V సిరీస్....

ఇప్పటివరకు వచ్చిన LG V సిరీస్ ఫోన్స్ అన్ని మార్కెట్ లో అమ్మకాలని కొల్లగొట్టేసింది .అదే విధంగా LG V40 లో ప్రత్యక ఆకర్షణగా 5 కెమెరాలు కాబట్టి ఈ ఫోన్ కూడా అమ్మకాల్లో దూసుకుపోతుందని కంపెనీ భావిస్తుంది.

గతంలో వచ్చిన LG V 30  ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి...

గతంలో వచ్చిన LG V 30 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి...

LG V 30 ఫీచర్స్....

6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ డిస్‌ప్లే, 2880 x 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 2 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, 16, 13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెంట్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్‌.

 

గతంలో వచ్చిన LG V30S ThinQ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి...

గతంలో వచ్చిన LG V30S ThinQ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి...

6 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ప్లస్ ఓఎల్ఈడి ఫుల్ విజన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 1440x 2880 పిక్సల్స్) విత్ 16:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్, 6జీబి ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్స్ (128జీబి + 256జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2టీబీ వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ సపోర్ట్, బ్లుటూత్ 5.0 (బీఎల్ఈ), నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3300ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0 టెక్నాలజీ.

 

 

 

Best Mobiles in India

English summary
LG officially reveals V40 ThinQ with five camera setup and soft-touch back.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X