హోమ్లీ ‘ఎల్ జీ’.., సౌండ్లీ ‘సోని’.., ఏది బెస్టో మీరే డిసైడ్ చేసుకోండి..!!

Posted By: Super

హోమ్లీ ‘ఎల్ జీ’.., సౌండ్లీ ‘సోని’.., ఏది బెస్టో మీరే  డిసైడ్ చేసుకోండి..!!

సోని ఎరెక్సన్ (Sony Ericsson), టెక్నాలజి వినియోగదారులకు సుపరిచతమైన బ్రాండ్.. అత్యుత్తమ సాంకేతికతతో పాట నాణ్యతతో రూపుదిద్దుకునే ఈ బ్రాండ్ భారతీయ మొబైల్ మార్కెట్లో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. 'ఎల్‌జీ"(LG), సామాన్య మధ్యతరగతి ప్రజలకు మంచి నేస్తం..ఉన్నత ప్రమాణాలతో కూడిన హ్యాండ్ సెట్లను సమంజసమైన ధరలతో వినియోగదారులకు చేరవ చేయటమే ఈ బ్రాండ్ లక్ష్యం. భారతీయ మధ్యతరగతి మొబైల్ మార్కెట్‌ను కొల్లగొట్టిన 'ఎల్‌జీ" ప్రస్తుతం మార్కెట్లో అందిరి నోటా నానుతుంది.

అయితే ఈ రెండు తయారు బ్రాండ్లు తమ తమ నూతన హ్యాండ్ సెట్లకు సంబంధించి వివరాలను వెల్లడించాయి. తమ బ్రాండ్ ముద్రతో స్మార్ట్ ఫోన్ అనుభూతిని వినియోగదారులకు అందించేందుకు ఈ మొబైల్ కంపెనీలు పోటీపడుతున్నాయి. సోని ఎరెక్సన్ బ్రాండ్ 'సోని ఎరెక్సన్ ఎక్స్ పీరియా ఆర్క్" పేరుతో, ఎల్ జీ 'ఎల్‌జీ ఆప్టిమస్ 2X" పేరుతో హ్యాండ్ సెట్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చే్స్తున్నాయి.

ఆకర్షణీయమైన ఫీచర్లతో ఒదిగి ఉన్న ఈ బ్రాండ్లు ఒకదానికి మించి మరొకటి పోటీ పడతున్నాయి. 'ఆండ్రాయిడ్" అధునాతర వర్షన్ v2.3 ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా ఈ రెండు హ్యాండ్ సెట్లు రూపుదిద్దకున్నాయి. ఈ ఫోన్ల ప్రొసెసింగ్ ప్రక్రియ విషయంలో యాజమాన్యాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాయి. సోని ఎరెక్సన్‌లో '1GHz స్కార్పియన్ ప్రొసెస్సర్"ను పొందుపరచగా, ఒకింత ఎక్కువగా ఎల్‌జీలో 'డ్యూయల్ కోర్ 1GHz" ప్రొసెస్సర్‌ను పొందుపరిచారు.

రెండు హ్యాండ్ సెట్లు కెమెరా వ్యవస్థను కలిగి ఉన్నాయి, ఎల్‌జీలోని కెమెరా అంశాలను పరిశీలిస్తే 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరాతో పాటు 8 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థ కలిగి ఉంది. సోని ఎరెక్సన్ 'ఎక్స్‌పీరియా" విషయానికి వస్తే 8 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను మాత్రమే పొందుపరిచారు. ఈ ఫోన్‌లో సెకండరీ కెమెరా కరువయ్యింది. 'హై రిసల్యూషన్" విషయంలోనూ 'ఎల్‌జీ" ముందంజలో ఉంది.

ఇతర అంశాలను పరిశీలిస్తే, మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా ఈ రెండు ఫోన్ల మెమరీని 32 జీబీకి పెంచుకోవచ్చు. ఇక వీటి ధరల విషయానికి వస్తే 'ఎల్‌జీ ఆప్టిమస్ 2X" రూ.24,450 ఉండగా సోని ఎరెక్సన్ ఎక్స్ పీరియా ధర రూ.26,000గా ఉంది. వీటిలో ఫీచర్లను తెలుసుకున్నారుగా.. 'సో" ఏది బెస్టో మీరే డిసైడ్ చేసుకోండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot