ఆ మొబైల్‌లో మెయిల్ చెక్ చేసుకుంటే...?

Posted By: Prashanth

ఆ మొబైల్‌లో మెయిల్ చెక్ చేసుకుంటే...?

 

మొబైల్‌లో నిరంతరం డాక్యుమెంట్స్ అదే విధంగా మొయిల్స్ చెక్ చేసుకునేవారికి ‘ఎల్‌జీ ఆప్టిమస్ బ్లాక్’ స్మార్ట్‌ఫోన్ ఉత్తమమైన ఎంపిక. ఈ మొబైల్ 4 అంగుళాల స్ర్కీన్ IPS ప్యానెల్ టెక్నాలజీతో రూపొందించబడింది. అదే విధంగా ప్రకాశవంతమైన టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే స్పష్టమైన క్లారిటీని కలిగి వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తుంది.

స్లిమ్ శరీరాకృతిలో డిజైన్ కాబడిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో ‘1 GHz TI OMAP 3630’ మొబైల్ ప్రాసెసర్, ‘PowerVR SGX 530’ గ్రాఫిక్ చిప్ వ్యవస్థలను నిక్షిప్తం చేశారు. గేమింగ్ వ్యవస్థను బలోపేతం చేసే గ్రాఫిక్ ఫీచర్ పూర్తి స్థాయి వినోదాన్ని శ్రోతకు పంచుతుంది.

ఫోన్ కెమెరా కాన్పిగరేషన్‌ను పరిశీలిస్తే 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా ఆటో ఫోకస్ మరియు LED ఫ్లాష్ వ్యవస్థను కలిగి ఉంటుంది. 720 పిక్సల్ హై డెఫినిషన్ వీడియోలను క్యాప్చుర్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 2.3.x జింజర్ బోర్డ్ ఆపరేటింగ్ సిస్టంను ఈ ఫోన్‌లో అపడేట్ చేయునున్నట్లు ఎల్‌జీ అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.

అన్ని విధాలైన కమ్యూనికేషన్ అవసరాలను ‘ఎల్ జీ ఆప్టిమస్ బ్లాక్’ తీరుస్తుంది. ధర కేవలం 19,900.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot