ఎల్‌జీ నుండి కొత్త ఆప్టిమస్ సిరిస్ ఫోన్..

Posted By: Staff

ఎల్‌జీ నుండి కొత్త ఆప్టిమస్ సిరిస్ ఫోన్..

ఎల్‌జీ కంపెనీ విడుదల చేసిన అన్ని రకాల మొబైల్ సిరిస్‌లలో కెల్లా అప్టిమస్ సరిస్ బాగా పాపులారిటీ సంపాదించిన సంగతి తెలిసిందే. ఈ పాపులారిటీని క్యాష్ చేసుకునేందుకు గాను ఎల్‌జీ ఆప్టిమస్ సరిస్‌లో మరో మొబైల్ పోన్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. దానిపేరే 'ఎల్‌జీ ఆప్టిమస్ ఈఎక్స్'. ఇక ఈ మొబైల్ ఫోన్‌ని ఎల్‌జీ శ్యామ్‌సంగ్ గెలాక్సీ, సోనీ ఎక్స్ పీరియా, నోకియా స్మార్ట్ ఫోన్ మోడల్స్‌కు పోటీగా మార్కెట్లోకి విడుదల చేయనుంది.

ఎల్‌జీ ఆప్టిమస్ ఈఎక్స్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి స్మార్ట్ ఫోన్. అంతేకాకుండా యూత్‌ని దృష్టిలోపెట్టుకోని ప్రత్యేకమైన స్టైల్స్‌తో రూపోందించడం జరిగింది. 4 ఇంచ్ మల్టీ టచ్ స్క్రీన్ డిస్ ప్లేతో యూజర్స్‌ని ఇట్టే ఆకర్షించగలిగే శక్తి ఈ మొబైల్ సోంతం. చూడడానికి సన్నగా ఉండి, స్క్రీన్ యొక్క రిజల్యూషన్ 800 X 480 ఫిక్సల్‌గా రూపోందించడం జరిగింది.

మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్ట్‌గా ఉండేందుకు గాను ఎల్‌జీ ఆప్టిమస్ ఈఎక్స్ మొబైల్‌లో 1.2GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. ప్రస్తుతం మార్కెట్లో అన్ని రకాల స్మార్ట్ పోన్స్‌లలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రూపోందించడం సర్వసాధారణమైన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఎల్‌జీ ఆప్టిమస్ ఈఎక్స్ మొబైల్‌ని కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ జింజర్ బ్రెడ్ 2.3 వర్సన్‌ని ఇనిస్టాల్ చేయడం జిరిగింది.

ఎల్‌జీ ఆప్టిమస్ ఈఎక్స్ మొబైల్ కెమెరా విషయానికి వస్తే మొబైల్ వెనుక భాగాన నిక్షిప్తం చేసిన 5 మెగా ఫిక్సల్ కెమెరా చూడచక్కని ఇమేజిలను తీయగలిగే సామర్ద్యాన్ని కలిగి ఉంది. మొబైల్‌తో పాటు కొంత మొమొరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 32జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. ఇంక మార్కెట్లో లభించే అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను కూడా సపోర్ట్ చేస్తుంది.

ఇక కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్ విషయానికి వస్తే బ్లూటూత్, వై-పై టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అయిన ఫేస్ బుక్, ట్విట్టర్‌లను కూడా ఈ ఎల్‌జీ ఆప్టిమస్ ఈఎక్స్ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఇన్ని అత్యాధునిక ఫీచర్స్ ఉన్న ఎల్‌జీ ఆప్టిమస్ ఈఎక్స్ మొబైల్ ధరని మార్కెట్లో ఇంకా ప్రవేశపెట్టలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించడం జరుగుతుంది. అప్పటి వరకు వన్ ఇండియా మొబైల్‌కి టచ్‌లో ఉండండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot