ఆ పుకార్లకు సామ్‌సంగ్ భయపడుతుందా..?

By Prashanth
|
LG


స్మార్ట్‌ఫోన్ రూమర్ మిల్స్ ఎల్‌జీ వైపు తమ దృష్టిని కేంద్రీకరించాయి. కొరియాకు చెందిన ఈ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ‘ఆప్టిమస్ జీ’ పేరుతో తరువాతి జనరేషన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను వృద్ధి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎల్‌జీ.. ఆప్టిమస్ ఎల్3, ఆప్టిమస్ ఎల్5, ఆప్టిమస్ ఎల్7, ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్‌డి వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసింది. శక్తివంతమైన క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఆధారంగా ఎల్‌జీ వృద్ధి చేస్తున్న శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ ఆప్టిమస్ జీ, గెలాక్సీ ఎస్ 3కి ప్రధాన పోటీదారు కానుందని మార్కెట్ వర్గాల్లో టాక్.

ఆప్టిమస్ ఫీచర్లు (నమూనా):

4.7 అంగుళాల ఐపీఎఎస్ ట్రూ హైడెఫినిషన్ డిస్‌ప్లే,

2జీబి ర్యామ్,

13 మెగా పిక్సల్ కెమెరా,

క్వాడ్ కోర్ ప్రాసెసర్,

వోల్ట్ సపోర్ట్ (వాయిస్ ఓవర్ 4జీ ఎల్‌టీఈ),

ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం.

సామ్‌సంగ్ ప్రధాన ప్రత్యర్థి:

సామ్‌సంగ్‌తో పోటీపడేందుకు ఎల్‌జీ ఉవ్విలూరుతోంది. ఆగష్లు 29న బెర్లిన్‌లో జరగనున్న ప్రీ-ఐఎఫ్ఏ 2012లో కార్యక్రమంలో సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2కు పోటీగా ఎల్‌జీ ఆప్టిమస్ వీయూ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తుంది.

గెలాక్సీ ఎస్3 స్పెసిఫికేషన్‌లు:

4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం(త్వరలో ఆండ్రాయిడ్ జెల్లీబీన్‌కు అప్‌డేట్ అయ్యే అవకాశం) , క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరవు 133 గ్రాములు. పెబ్బిల్ బ్లూ, మార్బుల్ వైట్ రంగుల్లో లభించే గెలాక్సీ ఎస్-3 16జీబి మెమరీ వేరియంట్ ధర రూ.38400, 32జీబి మెమెరీ వేరియంట్ ధర రూ.41,500.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X