పథకం ప్రకారం ‘ముంబైలో స్కెచ్’!

Posted By: Prashanth

పథకం ప్రకారం ‘ముంబైలో స్కెచ్’!

 

‘స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో దూసుకుపోతున్న సామ్‌సంగ్, హెచ్‌టీసీ, సోనీలకు చెక్ పెట్టే ప్రయత్నంలో ఎల్‌జీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లతో ముందుకొచ్చింది..’

యూజర్ ఫ్రెండ్లీ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఎల్‌జీ, గురువారం ముంబయ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో క్వాడ్‌కోర్ ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆధారితంగా స్పందించే శక్తివంతమైన ఎల్ సిరీస్ ఆప్టిమస్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించింది. ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్‌డి, ఆప్టిమస్ ఎల్5 మోడళ్లలో రూపుదిద్డుకున్న ఈ ఫోన్‌లు అత్యాధునిక మొబైలింగ్ వ్యవస్థను ఒదిగి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఎల్‌జీ మధ్య, దిగువ తరగుతులను టార్గెట్ చేస్తూ ఎల్ సిరీస్ నుంచి మరో రెండు హ్యాండ్‌సెట్‌లను ప్రకటించింది. ఎల్7, ఎల్3 మోడళ్లలో డిజైన్ కాబడిన ఈ గ్యాడ్జెట్‌లు కంఫర్టబుల్ గ్రిప్, సీమ్‌లెస్ లేఅవుట్, స్లిమ్‌ షేప్, హార్మోనైజుడ్ డిజైన్ కాంట్రాస్ట్, ఫ్లోటింగ్ మాస్ టెక్నాలజీ వంటి ఐదు మూల ధర్మాలను ఒదిగి ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (2012) ద్వారా పరిచయమైన ఆప్టిమస్ ఎల్3 ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఇతర ఫీచర్లను పరిశీలిస్తే...

3.2 అంగుళాల టచ్‌స్ర్కీన్,

800మెగాహెట్జ్ ప్రాసెసర్,

1జీబి ఇంటర్నల్ మెమెరీ, 384ఎంబీ ర్యామ్,

3మెగాపిక్సల్ రేర్ కెమెరా,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పెంచుకునే సౌలభ్యత,

1500ఎమ్ఏహెచ్ లి-యోన్ బ్యాటరీ,

వై-ఫై, 3జీ

బ్లూటూత్ వర్షన్ 3.0,

యూఎస్బీ కనెక్టువిటీ,

ధర రూ.8,895.

ఉత్తమ ఫీచర్లను కలిగి సమంజసమైన ధర శ్రేణిలో విడుదల కాబోతున్న ఆప్టిమస్ ఎల్3.. సామ్‌సంగ్ గెలాక్సీ వై, హెచ్‌టీసీ ఎక్స్ ప్లోరర్ ఫోన్‌లకు ప్రధాన పోటీదారుకానుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. మరో స్మార్ట్‌ఫోన్ ఆప్టిమస్ 7 ధరను రూ.19,900గా నిర్థారించారు. ‘సోనీ ఎక్స్‌పీరియా సోలో’, ‘సోనీ ఎక్స్‌పీరియా గో’లకు ఎల్7 పోటీదారు కానుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot