‘ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్ 5’.. కొనచ్చంటారా?

By Prashanth
|
LG Optimus


కొరియన్ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఎల్‍‌జీ ఇటీవల ఆప్టిమస్ సిరీస్ నుంచి డిజైన్ చేసిన హ్యాండ్‌సెట్ ‘ఎల్ 3 డ్యూయల్ ఇ405’ ఇండియాలో ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా లభ్యమవుతుంది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ‘ఫ్లిప్ కార్ట్’(Flipkart) ఈ డ్యూయల్ సిమ్ గ్యాడ్జెట్‌ను రూ.8,299కి ఆఫర్ చేస్తుంది.

స్పెసిఫికేషన్‌లను పరిగణంలోకి తీసుకుంటే డివైజ్ ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. శక్తివంతమైన కార్టెక్స్ ఏ5 800మెగాహెట్జ్ ప్రాసెసర్‌ను వినియోగించారు. 3.2 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే 240 x 320పిక్సల్ రిసల్యూషన్‌‌ను కలిగి ఉంటుంది. 3.2 మెగా పిక్సల్ కెమెరా, 384ఎంబీ ర్యామ్, 1జీబి ఇంటర్నల్ మెమెరీ, ఎక్సటర్నల్ మెమెరీ 32జీబి వయా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్. అమర్చిన శక్తివంతమైన 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ 17 గంటల టాక్‌టైమ్‌ను అందిస్తుంది. యూట్యూబ్, ఆండ్రాయిడ్ మార్కెట్, గుగూల్ +, గుగూల్ టాక్, జీమెయిల్, జీమెయిల్ సింక్, యాహూ, హాట్ మెయిల్, ఎల్‌జీ మెయిల్, లాటిట్యూడ్, న్యూస్ ఇంకా వెదర్ అప్‌డేట్ తదితర ఆన్‌లైన్ అంశాలకు సంబంధించిన అప్లికేషన్‌లను హ్యాండ్‌సెట్‌లో ముందస్తుగానే ప్రీలోడ్ చేశారు.

కనెక్టువిటీ ఫీచర్లు:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),

3జీ,

వై-ఫై,

బ్లూటూత్,

యూఎస్బీ కనెక్టువిటీ (వర్షన్ 2.0).

ఈ ఫోన్‌ను బుక్ చేసుకున్న వారికి 7 నుంచి 9రోజుల కాలవ్యవధిలో డెలివరీ ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ప్రస్తుత దేశీయ మార్కెట్ పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటే సామ్‌సంగ్, నోకియా, మైక్రోమ్యాక్స్‌లు తమ హావాను కొనసాగిస్తున్నాయి. మధ్య ముగింపు డ్యూయల్ సిమ్ మార్కెట్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఆప్టిమస్ ఎల్3 డ్యూయల్ పనితీరు .. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యూయోస్, గెలాక్సీ ఏస్ డ్యూయోస్ పరిధిలలో ఉంటుందని అంచనా.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X