అత్యుత్తమ 3జీ ఫోన్ 10,000లకే!!!

Posted By: Prashanth

అత్యుత్తమ 3జీ ఫోన్ 10,000లకే!!!

 

3జీ ఆధారిత అత్యుత్తమ స్మార్ట్ మొబైల్‌ను ఎల్‌జీ లాంఛ్ చేసింది. ‘ఆప్టిమస్ ఎల్3 E400’ వేరియంట్‌లో రూపుదిద్దుకున్న ఈ ఆండ్రాయిడ్ ఫోన్ హై క్వాలిటీ ఫీచర్లను ఒదిగి ఉంది. పటిష్టమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ వ్యవస్థలతో డిజైన్ కాబడిన ఈ డివైజ్ సమర్ధవంతమైన మొబైలింగ్‌కు తోడ్పడుతుంది. దేశంలో వీటి అమ్మకాలు ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అత్యుత్తమ ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌లతో రూ.10,000 ధరకే లభ్యంకానున్న

‘ఆప్టిమస్ ఎల్3 E400’ ముఖ్య ఫీచర్లు.........

ఫోన్ డిస్‌ప్లే 3.2 అంగుళాల పరిమాణం కలిగి టీఎఫ్టీ టచ్ వ్యవస్థ సౌలభ్యతతో పనిచేస్తుంది. మొబైల్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 3.15 మెగా పిక్సల్ కెమెరా మన్నికైన ఫోటోగ్రఫీ లక్షణాలను ఒదిగి ఉంటుంది. దోహదం చేసిన జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ (HSDPA), వై-ఫై, బ్లూటూత్ (v2.1 ), యూఎస్బీ, జీపీఎస్ వ్యవస్థలు మొబైల్ కనెక్టువిటీ అదే విధంగా కమ్యూనికేషన్ వ్యవస్థలను పటిష్టితం చేస్తాయి. 2జీ, 3జీ నెట్‌వర్క్‌లను మొబైల్ సపోర్ట్ చేస్తుంది. నిక్షిప్తం చేసిన ఉత్తమ క్వాలిటీ మల్టీ మీడియా ప్లేయర్ వ్యవస్థ వినోదపు అవసరాలను తీరుస్తుంది. ముందుగానే లోడ్ చేసిన పలు గేమింగ్ అప్లికేషన్స్ ఆటవిడుపు కల్పిస్తాయి. యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్‌లు హెచ్చుగా ఉన్న ఆండ్రాయిడ్ v2.3 ఆపరేటింగ్ వ్యవస్థపై ఫోన్ రన్ అవుతుంది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32 జీబికి పెంచుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot