ఓ మంచి మిడిల్ క్లాస్ ఫోన్!

Posted By: Super

ఓ మంచి మిడిల్ క్లాస్ ఫోన్!

రాబోయే తరం సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లను ప్రతిఘటించే క్రమంలో ఇతర స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. వీటిలో ఒకరైన కొరియన్ ఫోన్ మేకర్ ‘ఎల్‌జీ’ ఆప్టిమస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో ముందుకొచ్చింది. ఆప్లిమస్ ఎల్3, ఆప్టిమస్ ఎల్5, ఆప్టిమస్ ఎల్7, ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్‌డి మోడళ్లలో రూపుదిద్దుకున్న స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఎల్‌జీ ఇదివరుకే వెల్లడించింది. వీటిలో మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపుతెచ్చుకున్న ‘ఆప్టిమస్ ఎల్ 5’ రూ.13,000 ధరకు భారతీయ మార్కెట్లో లభ్యమవుతుంది. ఆండ్రాయిడ్ ఆధారితంగా స్పందించే ఈ డివైజ్ ఫీచర్లు అదేవిధంగా పనితీరును పరిశీలిద్దాం....

డిస్‌ప్లే ఇంకా డిజైనింగ్:

125గ్రాముల బరవుతో 118.3mm x 66.5mm x 9.9mm చుట్టుకొలతను కలిగి ఉన్న ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్ 5 చేతిలో సౌకర్యవంతంగా ఇముడుతుంది. 4 అంగుళాల డిస్‌ప్లే మన్నికైన 320 x 480పిక్సల్ రిసల్యూషన్. ఇతర ఆండ్రాయిడ్ ఫోన్‌లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. డివైజ్‌ను మరిత మన్నికగా వాడకునే క్రమంలో యూజర్ సమర్థంతమైన స్టైలస్‌తో పాటు ఉచిత ప్రొటెక్టివ్ కేస్‌ను కొనుగోలు సమయంలో పొందవచ్చు.

కీలక స్పెసిఫికేషన్‌లు అలాగే ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, ఎల్‌జీ ఆప్టిమస్ యూజర్ ఇంటర్ ఫేస్, 800మెగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

హై డైనమిక్ రేంజ్ ఇమేజింగ్ సపోర్ట్, బ్లూటూత్ 2.1, మైక్రో యూఎస్బీ 2.0 వర్షన్, వై-ఫై, జీపీఎస్, 3.5ఎమ్ఎమ్ హెడ్‌సెట్ జాక్, గుగూల్ సర్వీసెస్.

ఫోన్‌లో ఫ్రంట్ కెమెరా వ్యవస్థ లోపించింది. సింగిల్ కోర్ ప్రాసెసర్ కారణంగా ఇంటర్నెట్ కనెక్టువిటీ విషయంలో సమస్యలు తలెత్తనప్పటికి వెబ్‌పేజీల లోడింగ్ విషయంలో స్వల్ప నిరీక్షణ తప్పదు. జూమింగ్, పానింగ్, స్ర్కోలింగ్ తదితర విభాగాలు సమర్థవంతంగా స్పందిస్తాయి. ఎల్ 5, సింగిల్ కోర్ డివైజ్ కావటంతో స్టాక్ ఆండ్రాయిడ్ ఐసీఎస్ బ్రౌజర్ లోపించింది. ఈ కొరతను ఆడోబ్ ఫ్లాష్ సపోర్ట్ తీర్చేస్తుంది. లోడ్ చేసిన 1540 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 10 గంటల అంతరాయంలేని బ్యాకప్ ను సమకూరుస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot