టాప్-4... భలే చాన్స్ గురూ!

Posted By: Prashanth

టాప్-4... భలే చాన్స్ గురూ!

 

ఆధునిక స్పెసిఫికేషన్‌లను సంతరించుకున్న ఆండ్రాయిడ్ ఐసీఎస్ స్మార్ట్‌ఫోన్ ‘ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్ 7’ కొనుగోలు పై రూ.5000 రాయితీని ప్రకటించారు. వివరాల్లోకి వెళితే ‘ఆప్టిమస్ ఎల్7’ను 2012, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఆవిష్కరించారు. దేశీయ విపణిలో గత జూన్ నుంచి ఈ మధ్య ముగింపు ఫోన్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. అప్పటి ధర రూ.19,990. తాజాగా ఈ ఫోన్ ధరను తగ్గిస్తూ ఫ్లిప్‌కార్ట్‌తో సహా పలు ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లు ముందుకొచ్చాయి. వాటి వివరాలు.......

ఫ్లిప్‌కార్ట్ (Flipkart): ధర తగ్దింపులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్ ధరను రూ.15,990కి ఆఫర్ చేస్తోంది.

అడిక్స్‌మార్ట్(Adexmart): ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ రిటైలర్ అడిక్స్‌మార్ట్ ఆప్టిమస్ ఎల్ 7ను రూ.14,990కి ఆఫర్ చేస్తుంది. ఫ్రీ షిప్పింగ్ ఇంకా నెలసరి వాయిదా స్కీమ్ సౌలభ్యత,

ఇన్ఫీబీమ్(Infibeam): ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఇన్ఫీబీమ్, ఆప్టిమస్ ఎల్7ను రూ.15,475కు ఆఫర్ చేస్తోంది. 24గంటల్లో డెలివరీ సౌకర్యం కలదు.

బుయ్‌ద‌ప్రైస్ (BuyThePrice): బుయ్‌ద‌ప్రైస్ డాట్ కామ్ ఆప్టిమస్ ఎల్7ను రూ.15,690కి ఆఫర్ చేస్తోంది. ఆర్డర్ చేసిన రెండు మూడు రోజుల్లో ఫోన్ డెలివరీ అందుతుంది.

ఆప్టిమస్ ఎల్7 ఫీచర్లు:

4.3 అంగుళాల డబ్ల్యూజీఏ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

1గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా,

వీజీఏ ఫ్రంట్ కెమెరా,

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

1700ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

స్మార్ట్ ఫోన్స్ ఇంకా ఫీచర్ మొబైల్స్ కొనుగోలు విషయంలో ఉత్తమ ధర ఇంకా ఉత్తమ డీల్స్‌ కోసం goprobo.comలో చూడగలరు. లింక్ అడ్రస్

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot