టైటిల్ అదుర్స్.. స్టోరీ ఏంటి..?

Posted By: Prashanth

టైటిల్ అదుర్స్.. స్టోరీ ఏంటి..?

 

‘ఆప్టిమస్ ఎల్7’, తాజాగా ఎల్‌జీ కంపెనీ రూపొందించిన ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే ఈ డివైజ్ మల్టీ టచ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఫోన్ ఇతర ఫీచర్లను పరిశీలిస్తే...

* 4.3 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, * 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (రిసల్యూషన్ 2592 x 1944పిక్సల్స్), * ఈ కెమెరా ద్వారా హై క్వాలిటీ వీడియో రికార్డింగ్ నిర్వహించుకోవచ్చు, * ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, * ఆడియో ప్లేయర్, * వీడియో ప్లేయర్, * ఆన్‌లైన్ సర్వీస్ సపోర్ట్ (జీ టాక్, యూ ట్యూబ్), * 2జీ, 3జీ సపోర్ట్, * జీపీఆర్ఎస్ కనెక్టువిటీ, ఎడ్జ్ కనెక్టువిటీ, * వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఆడోబ్ ఫ్లాష్ బ్రౌజర్, * TI OMAP 4430 చిప్‌సెట్, శక్తివంతమైన డ్యూయల్ కోర్ ప్రాసెసర్.

పనితీరు:

పెద్దదైన ఫోన్ స్ర్కీన్ సౌకర్యవంతమైన అనుభూతికి లోనుచేస్తుంది. ఏర్పాటు చేసిన టచ్ సెన్సిటివ్ కంట్రోల్స్ సంబంధిత లావాదేవీలను వేగవంతంగా నిర్వహించటంతో పాటు సమయాన్ని మరింత ఆదా చేస్తాయి. ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ కెమెరా ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీకి తోడ్పడుతుంది. నిక్షిప్తం చేసిన డ్యూయల్ కోర్ ప్రాసెసర్ వేగవంతమైన పనితీరుకు దోహదపడుతుంది. మేలో విడుదల కాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి ధర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot