ఎల్‌జీ ఆప్టిమస్ సిరిస్‌లో కొత్త మొబైల్ రాక..

Posted By: Super

ఎల్‌జీ ఆప్టిమస్ సిరిస్‌లో కొత్త మొబైల్ రాక..

ఎల్‌జీ మొబైల్ కంపెనీ ఇప్పటి వరకు మార్కెట్లోకి చాలా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎల్‌జీ విడుదల చేసిన అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌లలో చెప్పుకోదగ్గ సిరిస్ ఎల్‌జీ ఆప్టిమస్ సిరిస్. అటువంటి ఎల్‌జీ ఆప్టిమస్ సిరిస్ విభాగంలోకి మరో కొత్త మొబైల్ రానుంది. దాని పేరు ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్టీఈ. ఎల్‌జీ మొబైల్స్ దీని విడుదల అధికారకంగా ప్రకటించకపోయినప్పటికీ ఇంటర్నెట్లో దీని సంబంధించిన సమాచారం కొంత మార్కెట్లోకి విడుదలవ్వడం జరిగింది. యూజర్స్ కోసం ప్రత్యేకంగా క్లుప్తంగా ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్టీఈ ఫీచర్స్..

ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్టీఈ మొబైల్ ఫెర్పామెన్స్ స్పీడ్‌గా ఉండేందుకు గాను ఇందులో 1.5 GHz డ్యూయల్ కోర్ క్వాలికామ్ MSM8660 Snapdragon ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను స్క్రీన్ సైజు 4.5 ఇంచ్ డిస్ ప్లేగా కలిగి ఉంది. ఇంతవరకు ఎల్‌జీ విడుదల చేసిన అన్ని మొబైల్స్‌లలో కెల్లా ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్టీఈ మొబైల్ యొక్క స్క్రీన్ రిజల్యూషన్ పెద్దదిగా సుమారు 1280 x 720 ఫిక్సల్‌గా రూపోందించడం జరిగింది.

ఇటీవల కాలంలో అన్ని హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్‌లలో గూగుల్‌కి చెందిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇనిస్టాల్ చేయడం పరిపాటిగా కోనసాగుతుంది. ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్టీఈ మొబైల్‌లో కూడా గూగుల్‌కి చెందిన ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ వి2.3.5 వర్సన్ ఆపేరిటంగ్ సిస్టమ్‌ని చేయడం జరిగింది. ఈ మొబైల్ లో ఉన్న మరో ముఖ్య విశేషం ఏమిటంటే ఇందులో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్‌ని అప్ గ్రేడ్ కూడా చేసుకొవచ్చు.

ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్టీఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే ఇందులో 8 మెగా ఫిక్సల్ కెమెరాని అమర్చడం జరిగింది. వీడియో కాలింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చుకునేందుకు గాను ఇందులో సెకండరీ కెమెరాని 1.3 మెగా ఫిక్సల్‌గా రూపొందించడం జరిగింది. మొబైల్ వెనుక భాగంలో ఉన్న కెమెరా సహాయంతో పుల్ HD 1080p వీడియో రికార్డింగ్‌ని తీయవచ్చు. ఇంటర్నెట్లో ఉన్న రూమర్స్ ప్రకారం ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్టీఈ మొబైల్ వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని కంపెనీ వర్గాలు తెలియజేశారు. మొబైల్ మార్కెట్లో ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్టీఈ మొబైల్ ధరని రూ 18,000గా నిర్ణయించడమైంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot