'ఆండ్రాయిడ్' రంగుని పులుముకొనున్న 'ఎల్‌జీ'

Posted By: Super

'ఆండ్రాయిడ్' రంగుని పులుముకొనున్న 'ఎల్‌జీ'

ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎల్‌జీ కంపెనీకున్న పేరు ప్రఖ్యాతులు అమోఘం. ఇటీవల మొబైల్స్ రంగంలోకి అడుగుపెట్టిన ఎల్‌జీ కంపెనీ తనదైన శైలిలో దూసుకుపోతుంది. సామాన్యుడి దగ్గర నుండి ధనవంతులు వాడేందుకు వీలుగా అందరిని దృష్టిలో పెట్టుకొని మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేస్తుంది. ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్స్ హావాని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తానేమీ తక్కువ తినలేదంటూ అడపాదడపా మొబైల్ ఫోన్స్‌ని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తూ వచ్చింది. ఎల్‌జీ విడుదల చేసిన మోడల్స్‌లలో బాగా సక్సెస్ సాధించిన మోడల్స్ ఎల్‌జీ ఆప్టిమస్ సిరిస్ మొబైల్స్.

దీనిని దృష్టిలొ పెట్టుకొని ఎల్‌జీ కంపెనీ తనయొక్క ఎల్‌జీ ఆప్టిమస్ సిరిస్ మొబైల్ పోన్స్‌లలో గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇనిస్టాల్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇది గనుక జరిగితే ఎల్‌జీ ఆప్టిమస్ సిరిస్‌లలో ఆండ్రాయిడ్ 2.3 వర్సన్‌కు చెందిన జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో అప్ గ్రేడ్ చేస్తారు. ఎల్‌జీ అప్ డేట్ చేయనున్న మొబైల్ ఫోన్స్ ఎల్‌జీ ఆప్టిమస్ బ్లాక్, ఎల్‌జీ ఆప్టిమస్ 3డి, ఎల్‌జీ ఆప్టిమస్ 2ఎక్స్. గూగుల్ విడుదల చేసిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌(జింజర్ బ్రెడ్, హానీకూంబ్, ఐస్ క్రీమ్ శాండ్‌విచ్)లలో ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌నే ఇనిస్టాల్ చేయడానికి గల కారణాలను కూడా వెల్లడించా రు.

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్(హానీకూంబ్, ఐస్ క్రీమ్ శాండ్‌విచ్)లు రెండూ కూడా టాబ్లెట్స్, పెద్ద పెద్ద డిస్ ప్లే కలిగిన వాటికి మాత్రమే ఎఫెక్టివ్‌గా పనిచేయడం వల్లనే ఎల్‌జీ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఎంచుకొవడం జరిగింది. ఇక ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే కస్టమర్స్‌ ఈజీగా ఇందులో ఉన్న అన్నిరకాల ఫీచర్స్‌ని అర్దం చేసుకొవచ్చు. డౌన్ లోడ్ మేనేజర్ సహాయంతో మనకు కావాల్సిన అప్లికేషన్స్ అన్నింటిని డౌన్ లోడ్ చేసుకొని ఒకేచోటు నుండి యాక్సెస్ చేసుకొవచ్చు.

నవంబర్ మొదటి వారంలో ఎల్‌జీ ఆప్టిమస్ 2ఎక్స్‌ని ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి అప్ గ్రేడ్ చేస్తుండగా, నవంబర్ 21న ఎల్‌జీ ఆప్టిమస్ 3డి, నవంబర్ 28న ఎల్‌జీ ఆప్టిమస్ బ్లాక్‌ని అప్ గ్రేడ్ చేయనున్నారు. పైన తెలిపిన డేట్స్ కేవలం యూరప్ దేశాలకు మాత్రమే వర్తిస్తాయి. మిగిలిన దేశాలకు సంబంధించిన సమాచారం ఎల్‌జీ ప్రత్యేకంగా ఆయా దేశాల ఎల్‌జీ వెబ్ సైట్ ద్వారా తెలియజేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot