ఎల్‌జీ ఆప్టిమస్ మరో కొత్త మోడల్ పి690

Posted By: Super

ఎల్‌జీ ఆప్టిమస్ మరో కొత్త మోడల్ పి690

ప్రపంచంలో ఎక్కువ కస్టమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ చేయగలిగే సత్తా ఉన్న కంపెనీ ఎల్‌జీ. టెనలివిజన్స్, రిఫ్రిజిరేటర్స్‌లకు ఎల్‌జీ కంపనీ పెట్టింది పేరు. వీటితోపాటు గ్లోబల్ మొబైల్ మార్కెట్లో ఉత్సాహాంగా కొత్త మోడల్స్‌ని విడుదల చేస్తుంది. ఇప్పటి వరకు ఎల్‌జీ కంపెనీ మార్కెట్లోకి హైఎండ్ మొబైల్స్ ఐతే కానీ, బేసిక్ మోడల్స్ ఐతే కానీ వందకు పైగా మోడల్స్‌ని విడుదల చేసింది. ప్రపంచం మొత్తం మీద ఎల్‌జీ కంపెనీ 130 దేశాలలో తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ప్రస్తుతం మార్కట్లో ఉన్న నోకియా, శ్యామ్‌సంగ్, మోటరోలా, హెట్‌టిసి కంపెనీల ఉత్పత్తలకు గట్టి పోటీని అందిస్తుంది.

మొట్టమొదట స్మార్ట్ ఫోన్స్‌ని పరిచయం చేసిన కంపెనీ కూడా ఎల్‌జీ అనే చెప్పాలి. త్వరలో ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి రానున్న ఎల్‌జీ ఆప్టిమస్ పి690 హ్యాండ్ సెట్ గురించిన సమాచారం తెలుసుకుందాం. ముఖ్యంగా మల్టీమీడియాని దృష్టిలో పెట్టుకోని ఎల్‌జీ ఆప్టిమస్ పి690 మొబైల్ ఫోన్‌ని రూపోందించడం జరిగింది. ఎల్‌జీ ఆప్టిమస్ పి690 మార్కెట్లో ఉన్న వేరే కంపెనీల మొబైల్స్ గట్టి పోటీని ఇవ్వడమే కాకుండా దీనివల్ల ఆదాయం కూడా బాగా వస్తుందని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి.

ఎల్‌జీ ఆప్టిమస్ పి690 విశేషాలను చూసుకున్నట్లైతే పుల్ టచ్ స్క్రీన్ ఫెసిలిటీతోపాటు స్క్రీన్ సైజు 3.2 ఇంచ్ డిస్ ప్లేని కలిగి ఉంటుంది. ఈ మొబైల్ చూడడానికి చాలా సింపుల్‌గా ఉండి మెను బటన్స్ ని ఈజీగా యాక్సెస్ చేసుకునేందుకు వీలుగా ప్రంట్ ప్యానల్‌లో అమర్చడం జరిగింది. ఎల్‌జీ ఆప్టిమస్ పి690 మొబైల్ ఆండ్రాయిడ్ 2.3.3 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 3మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండి ఆటో ఫోకస్, డిజిటల్ జూమ్‌ దీని సోంతం. విజిఎ ఫార్మెట్ వీడియో రికార్డింగ్ ఫీచర్ ఉంది. ఎంటర్ట్‌న్మెంట్, మల్టీమీడియా ఫీచర్స్ లలో కస్టమర్స్‌‌కు మంచి అనుభూతిని కలగజేస్తుంది.

ప్రయివేట్‌‌గా మ్యూజికల్ ఎక్స్ పీరియన్స్‌ని సోంతం చేసుకునేందుకు ఇందులో 3.5 mm ఆడియో జాక్ కనెక్టివిటీ లభిస్తుంది. ఇక కనెక్టివిటీ, కమ్యూనికేషన్ టెక్నాలజీలు అయిన బ్లూటూత్, వై-పై, వైర్ లెస్ ల్యాన్ టెక్నాలజీలను ఇది సపోర్ట్ చేస్తుంది. EDGE, GPRS ద్వారా హై స్పీడ్ 3జి కనెక్టివిటీని అందిస్తుంది. ఎల్‌జీ ఆప్టిమస్ పి690 ఈ సంవత్సరం నవంబర్ చివరికల్లా ఇండియన్ మార్కెట్లోకి రావచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

LG Optimus P690 Specifications:

Android OS
3 Mega Pixel camera
Wi-Fi and Bluetooth
GPRS, EDGE
JAVA
Games

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot