ఎల్‌జీ ఆప్టిమస్ ప్రొ సి660లో అదిరేటి ఫీచర్స్

Posted By: Staff

ఎల్‌జీ ఆప్టిమస్ ప్రొ సి660లో అదిరేటి ఫీచర్స్

మొబైల్ ప్రియులకు మార్కెట్లో ఎప్పుడెప్పుడు ఏఏ కొత్త మొబైల్స్ విడుదలవుతున్నాయో తెలుసుకోవడం దాని గురించిన పూర్తి సమాచారం సేకరించి తమ స్నేహితులకు వివరించడం అనేది ఓ పెద్ద అలవాటు. అందులో భాగంగానే మార్కెట్లోకి ప్రస్తుతం ఎల్‌జీ ఆప్టిమస్ సిరిస్‌‌కి సంబంధించి మరొ కొత్త మోడల్‌ని మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. దాని పేరే ఎల్‌జీ ఆప్టిమస్ ప్రొ సి660. ఎల్‌జీ ఆప్టిమస్ ప్రొ సి660 మార్కెట్లోకి విడుదలవుతుందని అప్పుడే మార్కెట్లో దీనిపై చర్చాగోష్టి జరుగుతుంది. స్మార్ట్ ఫోన్‌‌‌కి దీటుగా అన్ని రకాల ఫీచర్స్‌‌‌ని ఇందులో పోందుపరచడం జరిగింది.

గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 2.3 వర్సన్‌ని ఇందులో పోందురచడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్లో సంచరిస్తున్న మోషన్ సెన్సార్ అనే సరిక్రొత్త ఫీచర్‌‌ని ఇందులో పోందుపరచడం జరిగింది. హై ఎండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ శ్యామ్ సంగ్ గెలాక్సీ‌లో ఉన్న ముఖ్యమైన ఫీచర్ మెసేజింగ్ సిస్టమ్‌‌ని చూసేటటువంటి వెసులుబాటుని ఇప్పుడు ఎల్‌జీ ఆప్టిమస్ ప్రొ సి660లో పోందుపరచడం జరిగింది. వీటితో పాటు గూగుల్ మ్యాప్, అప్లికేషన్స్‌ని డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది.

3.2 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండి జియో టాగింగ్ అనే సరిక్రొత్త ఫీచర్‌‌ని ఇందులో రూపోందించడం జరిగింది. కనెక్టివిటీ ఆఫ్షన్స్ బ్లూటూత్, వై-పై, 3జి ఇంటర్నెట్ మొదలగున వాటిని సపోర్ట్ చేస్తుంది. ఇక 2జీ టెక్నాలజీలు అయిన GPRS, EDGEలను కూడా సపోర్ట్ చేస్తుంది. ఆన్ లైన్‌లో మీ వీడియోలు, ఫోటోలను మాత్రమే కాకుండా మీయొక్క చిన్న చిన్న మూమెంట్స్‌ని కూడా సన్నిహితులతో షేర్ చేసుకోవచ్చు. వీటితోపాటు ఎల్‌జీ ఆప్టిమస్ ప్రొ సి660లో కొన్ని ప్రీ లోడెడ్ అప్లికేషన్స్‌ని పోందుపరచడం జరిగింది. దీంతో ఆండ్రాయిడ్ మార్కెట్లో మొబైల్‌కి కావాల్సిన కొన్ని అప్లికేషన్స్‌ని, సాప్ట్ వేర్స్‌ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఎల్‌జీ ఆప్టిమస్ ప్రొ సి660లో ఉన్న డాక్యుమెంట్ వివర్ ద్వారా డాక్యుమెంట్స్‌ని ఎడిట్ చేసి మరలా వాటిని సేవ్ చేసుకునే అవకాశం ఉంది. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్, యూట్యూబ్ అప్లికేషన్స్, జావా సపోర్ట్ అప్లికేషన్స్ అన్నింటిని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ మొబైల్‌లో పెద్ద డ్రాబ్యాక్ ఏమిటంటే స్క్రీన్ సైజు కేవలం 2.8 ఇంచ్ స్క్రీన్ డిస్ ప్లే సిస్టమ్. వీటితో పాటు రెండు విండోస్‌‌‌ని మొబైల్‌లో రన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. దీని ఉపయోగం ఏమిటంటే మీరు ఇంటర్నెట్లో ఏదైనా సమాచారాన్ని చూస్తుంటే, సడన్‌గా మీకు ఏమైనా మేసేజ్‌లు వచ్చినట్లైతే విండోని మినిమైజ్ చేసి మేసెజ్‌లను చదవొచ్చు.

ఇక ఎల్‌జీ ఆప్టిమస్ ప్రొ సి660 మొబైల్ తో పాటు 150 MB మొమొరీ కెపాసిటీ లభించగా మొమొరీని ఎక్పాండ్ చేసుకునేందుకుగాను ఇందులో మైక్రో ఎస్‌డి స్లాట్ ఉంది. ఇండియన్ మార్కెట్లో ఎప్పుడు విడుదల చేసేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇక దీని ఖరీదు విషయానికి వస్తే సుమారుగా రూ 12,000వరకు ఉండవచ్చునని అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ఇండియాలోని అన్ని స్టోర్స్‌లలో దర్శనమివ్వనుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot