ఎల్‌జీ ఆప్టిమస్ సోల్ E730

Posted By: Prashanth

ఎల్‌జీ ఆప్టిమస్ సోల్ E730

 

ఎల్‌జీ సరికొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ఆప్టిమస్ సోల్ E730ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను తొలిగా 2011 ఆగష్టులో ప్రకటించారు. త్వరలో ఈ డివైజ్‌కు ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ అప్‌డేట్ వర్తించనుంది. ఈ ఫోన్ పనితీరు అదేవిధంగా ఫీచర్లకు సంబంధించి వివరాలను చూద్దాం...

ఫోన్ పూర్తి ప్యాకేజి:

ఎల్‌జీ ఆప్టిమస్ సోల్ హ్యాండ్ సెట్.

ఛార్జర్,

యూఎస్బీ డేటా కేబుల్,

యూజర్ మాన్యుల్,

2జీబి మెమెరీ కార్డు.

డిజైన్:

ఈ హ్యాండ్‌సెట్ డిజైనింగ్ పూర్తి స్థాయి స్లిమ్ ఇంకా స్లీక్ స్వభావం కలిగి ఉంటుంది.తక్కువ బరువు కలిగిన ఈ హ్యాండ్‌సెట్‌ను సులువుగా క్యారీ చెయ్యవచ్చు. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన గ్లోసీ ప్యానల్ స్ర్కీన్ పై గీతల ఏర్పడకుండా సంరక్షిస్తుంది. గ్యాడ్జెట్ ముందు ప్యానెల్ ఎక్కువ భాగం స్ర్కీన్‌తో ఆక్రమించబడి ఉంటుంది. డిస్‌ప్లే పరిమాణం 3.8 అంగుళాలు. ఫ్రంట్ నిర్థిష్టమైన ప్రదేశంలో నిక్షిప్తం కాబడి ఉంటుంది. స్ర్కీన్ కింద భాగంలో మూడు టచ్ బటన్‌లను ఏర్పాటు చేశారు. ఫోన్ వెనుక భాగం ఎక్కువగా బ్యాటరీ ప్యానెల్‌తో కప్పబడి ఉంటుంది. సిమ్‌కార్డ్ ఇంకా మైక్రో‌ఎస్డీ కార్డులను పెట్టుకునేందుకు స్లాట్‌లను వెనుక భాగంలో ఏర్పాటు చేశారు.

In Hindi

డిస్‌ప్లే:

ఎల్‌జీ ఆప్టిమస్ సోల్ 3.8 అంగుళాల అల్ట్రా ఆమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది రిసల్యూషన్ సామర్ధ్యం 800 x 480పిక్సల్స్. అనేక రంగులతో సుసంపన్నమైన ఉత్తమమైన విజువల్స్‌ను ఈ డిస్‌ప్లే అందిస్తుంది. వీడియోలతో పాటు వివిధ గేమ్‌లను ఉత్తమమైన క్వాలిటీతో వీక్షించవచ్చు. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 5 మెగా పిక్సల్ కెమెరా ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ సౌలభ్యతతో 720 పిక్సల్ రిసల్యూషన్ తో కూడిన వీడియోలను హైడెఫినిషన్ శ్రేణిలో రికార్డ్ చేసుకోవచ్చు. ఏర్పాటు చేసిన

ఉత్తమ క్వాలిటీ ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్లు మన్నికైన వినోదాలను చేరువచేస్తాయి.

ఫోన్ హార్డ్‌వేర్, సాఫ్ల్‌వేర్ స్సెసిఫికేషన్‌లు:

1గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ ఎమ్ఎస్ఎమ్8255 ప్రాసెసర్,

512ఎంబీ ర్యామ్,

ఆండ్రాయిడ్ 2.3.4 ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

బ్లూటూత్,

వై-ఫై,

బ్యాటరీ:

డివైజ్‌లో ఏర్పాటు చేసిన 1500 mAh బ్యాటరీ వినియోగాన్ని బట్టి బ్యాకప్ నిస్తుంది. ఇండియన్ మార్కెట్లో ఎల్‌జీ ఆప్టిమస్ సోల్ ధర రూ.16,990.

అనుకూలించే అంశాలు:

ఉత్తమమైన క్లారిటీని అందిచే ఆమోల్డ్ డిస్‌ప్లే,

స్పీడ్ బ్రౌజింగ్,

తక్కువ బరువు కలిగిన ప్యానల్,

స్లీక్ డిజైన్,

మన్నికైన టచ్ ఇంటర్ ఫేస్.

తప్పొప్పులు:

కెమెరా ఫ్లాష్ లేదు,

తక్కువ కాంతి వాతవరణలో కెమెరా ఇమేజ్ క్వాలిటీ బాగోదు,

అంతగా శక్తివంతం కాని 1500 mAh బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot