లీకుల వీరులు మళ్లీ 'ఎల్‌జీ'ని లీక్ చేశారు..

Posted By: Super

లీకుల వీరులు మళ్లీ 'ఎల్‌జీ'ని లీక్ చేశారు..

ఎల్‌జీ ఇప్పటి వరకు మార్కెట్లో ఎన్నో రకాల స్మార్ట్ పోన్స్‌ని విడుదల చేసింది కానీ, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి స్మార్ట్ పోన్‌ని మాత్రం ఇంత వరకు విడుదల చేయలేదని అనుకునే కస్టమర్స్‌కి ఆ ముద్దు మచ్చుట తీర్చనుంది. 'ఎల్‌జీ ఆప్టిమస్ యు1' అనే స్మార్ట్ ఫోన్‌ని త్వరలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్దంగా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో హాల్ చల్ చేస్తున్నాయి.

'ఎల్‌జీ ఆప్టిమస్ యు1' స్మార్ట్ ఫోన్ చూసేందుకు పెద్ద స్క్రీన్, తక్కువ మందం కలిగి చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. 'ఎల్‌జీ ఆప్టిమస్ యు1' మొబైల్ గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్‌విచ్‌తో రన్ అవుతుంది. దీని ఫీచర్స్ విషయానికి వస్తే 4.5 ఇంచ్ వెడల్పైన్ డిస్ ప్లేని కలిగి ఉంది. ఇప్పటి వరకు మార్కెట్లో ఎల్‌జీ కంపెనీ నుండి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి స్మార్ట్ ఫోన్ రాకపోవడంతో ఎల్‌జీ దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది.

ఎల్‌జీ కంపెనీ గతంలో విడుదల చేసిన ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్‌టిఈ మొబైల్ పరిశ్రమలో పెద్ద సక్సెస్‌ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పడు విడుదల చేయనున్న 'ఎల్‌జీ ఆప్టిమస్ యు1' కూడా అదే కొవలోకి వస్తుందని ఎల్‌జీ ప్రతినిధులు భావిస్తున్నారు. 'ఎల్‌జీ ఆప్టిమస్ యు1' మొబైల్‌లో 8 మెగా ఫిక్సల్ కెమెరాని నిక్షిప్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతానికి కొన్ని ఫీచర్స్ మాత్రమే ఇంటర్నెట్లో లీక్ అవడం జరిగింది. ఎల్‌జీ కంపెనీ మాత్రం అధికారకంగా దీనికి సంబంధించిన ఎటువంటి విషయాలను బయటకు వెల్లడించ లేదు.

త్వరలోనే వన్ ఇండియా మొబైల్ ప్రేమికులకు 'ఎల్‌జీ ఆప్టిమస్ యు1'కు సంబంధించిన పూర్తి సమాచారం అందజేయడం జరుగుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot