ఎల్ జీ ‘పంచతంత్రం’...

By Super
|
LG Android phones
రోజులు గడిచాయి.. వ్యవస్థ మారింది.. మనుషులు మారారు.. టెక్నాలజీ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో, వ్యాపర వర్గాల్లో ప్రతి నిమషం పోటీనే.. ప్రస్తుతం ఏ మార్కెట్లో చూసినా ‘సెల్ ఫోన్ల’ గోలే. మానవుని దైనందిన జీవితంలో నిత్యావసరమైన ఈ ‘సమాచార పరికరం’ మానవ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే పరికరంలా వెలుగులోకి వచ్చిన సెల్ ఫోన్, క్రమేపీ అభివృద్థి చెంది విశ్వాన్నే మన గుప్పెట్లోకి తెచ్చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా ‘ఆండ్రాయిడ్’ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు.. ప్రపంచపు స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో సగానికి పైగా ఉన్న అమ్ముడైన ‘ఆండ్రాయిడ్’ ఆపరేటింగ్ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ కంప్యూటర్లకు దీటుగా నిలిచాయి. మన్నికతో పాటు సాంకేతికతకు మేటిగా నిలిచిన ఈ ఫోన్ల అమ్మకాలు భవిష్యత్తులో మరింత వృద్ధి చెందుతాయని తయరీదారులతో పాటు విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

 

‘ఎల్ జీ’ ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరూ.. ఎలక్ట్రానిక్ వస్తు తయారీలో ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించిన ఈ సంస్థ ఇటు సెల్ ఫోన్ మార్కెట్లోనూ దూసుకుపోతుంది. ఆండ్రాయిడ్ వ్యవస్థతో రూపుదిద్దుకుంటున్న 5 ఫోన్ సెట్లను ఎల్ జీ సంస్థ 2011 చివరి నాటికి విడుదల చేయునున్నట్లు ఓ విశ్వసనీయ వెబ్ సైట్ పేర్కొంది. వీటిలో నాలుగు మోడళ్లు ‘ఆండ్రాయిడ్ జింజర్ బోర్డు’ ఆపరేటింగ్ వ్యవస్థతో చేస్తే 1 మోడల్ మాత్రం ఆండ్రాయిడ్ ఫ్రోయో వర్షన్ సహకారంతో పని చేస్తుందట.

 

ఈ మోడళ్లలో ఒకటైన ‘ఎల్ జీ ప్రడా కె2’ శక్తివంతమైన ఆండ్రాయిడ్ జింజర్ బోర్డు వ్యవస్థతో పాటు డ్యూయల్ కోర్ ప్రాసెసర్ తో రూపుదిద్దుకుంటుందిం. 4.3 అంగుళాల వైశాల్యంతో టచ్ స్ర్కీన్ తో పని చేసే ఈ ఫోన్ 3జీ, వైఫై వంటి అదనపు ఆప్షన్లు కలిగి ఉంది. ఆకట్టకునే స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ మొబైల్ నవంబర్ లో మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం.

సామన్య మధ్యతరగితి వినియోగదారులను ఆకట్టకునేందుకు ఎల్ జీ ప్రవేశపెడుతున్న మరో మొబైల్ పేరు ‘విక్టర్’. ఆండ్రాయిడ్ జింజర్ బోర్డు వర్షన్ తో రూపుదిద్దుకుంటున్న ఈ ఫోన్ 1 (GHz) ప్రొసెసర్ తో పాటు, 5 మోగా పిక్సల్ కెమోరా సామర్థ్యం కలిగి ఉంది. ఎల్ జీ ప్రవేశపెట్టబోతున్న మరో మొబైల్ ‘ఎల్ జీ యునీవా’, 3.5 అంగుళాల డిస్ ప్లే సామర్థ్యంతో పాటు 800 (MHz) ప్రొసెస్సర్ తో తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ మొబైల్ 5 మెగా పిక్సల్ కెమెరా కలిగి ఉంది.

స్ప్రింటర్స్ తో పాటు అథ్లెట్స్ కోసం ఎల్ జీ ప్రవేశపెడుతున్న మరో మోడల్ ‘ఎల్ జీ జిలాటో’, ఎన్ ఎఫ్ సీ చిప్ ప్రత్యేక ఆకర్షణగా 3 మెగా పిక్సల్ కెమోరాతో రూపుదిద్దుకుంటున్న ఈ మొబైల్ జింజర్ బోర్డు ఆపరేటింగ్ వ్యవస్థతో పాటు 800 MHz ప్రొసెస్సర్ తో పనిచేస్తుంది. ఇక ‘ఎల్ జీ E2 ’ పేరుతో ఎల్ జీ మరో మొబైల్ ను ప్రవేశపెడుతుంది. ఆండ్రాయిడ్ ఫ్రోయో ఆపరేటింగ్ వ్యవస్థతో రూపుదిద్దుకుంటున్న ఈ ఫోన్ 3 మోగా పిక్సల్ కెమెరా కలిగి ఉంది. వీటి ధరలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే 2011 చివరి నాటికి ఈ మొబైల్స్ మార్కెట్లోకి వస్తాయని వ్యపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X