Home
Mobile

‘బ్రైస్’ స్మార్ట్ ఫోన్ విడుదలకు ఎల్‌‌జీ‌ సన్నాహాలు

By Super
LG Bryce
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒక్కటైన భారత దేశంలో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఈ స్మార్ట్ ఫోన్లు చేరువయ్యే విధంగా పలు కంపెనీలు పోటీ పడి మరి కొత్త బ్రాండ్ లను ప్రవేశపెడుతున్నాయి. స్వదేశీ కంపెనీలైన మైక్రోమ్యాక్స్, మ్యాక్స్, వీడియోకాన్ వంటి లోకల్ బ్రాండ్ లు సైతం స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెడుతున్నాయి. దేశంలో ఐటీ సంస్థలు అభివృద్ధి చెందటంతో పాటు ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవనానికి ప్రజలు అలవాటు పడటంతో స్మార్ట్ ఫోన్లకు క్రేజ్ పెరిగింది. ప్రస్తుత స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో నోకియా, సోని ఎరెక్సన్, శ్యామ్ సంగ్, ఎల్ జీ, హెచ్ టీసీ బ్రాండ్ల మధ్య పోటీ నడుస్తోంది.

ఎలక్ట్రానిక్ ఇంటి పరికరాల అమ్మకాలతో పాటు సెల్ ఫోన్ల మార్కెట్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచి ఎల్ జీ (లైఫ్ గుడ్) సంస్థ ఎల్ జీ ‘బ్రైస్’ పేరుతో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అత్యాధినిక ఆప్లికేషన్లతో రూపుదిద్దుకుంటున్న ఈ మొబైల్ 4.3 అంగుళాల డిస్ ప్లే వైశాల్యంతో టచ్ స్ర్కీన్ ఆధారంగా పని చేస్తుంది. ఉన్నత ప్రమాణాలతో కూడిన ఫీచర్స్ ను ఈ స్మార్ట్ ఫోన్ సాఫ్ట్ వేర్ లో పొందు పరిచారు. నాణ్యమైన ఆడియో, వీడియో సదుపాయాలతో పాటు హెచ్263, హెచ్264 వీడియో పరిమాణాలను పొందుపరిచారు.

ఎఫ్ఎమ్ రేడియో సౌలభ్యంతో పాటు ఆర్ డీ ఎస్ ను సపోర్టు చేసే 3.5 (ఎం.ఎం) యూనివర్సల్ ఆడియో జాక్ అదనపు ఆకర్షణ. మొబైల్ లోని వీడియో కంటెంట్ ను హైపర్ డెఫినిషన్ నాణ్యతతో పెద్ద స్ర్ర్కీన్ల పై చూసే అవకాశాన్ని కల్పించారు. బ్రైస్ మొబైల్ వెనుక భాగంలో అమర్చిన శక్తివంతమైన కెమెరా నాణ్యమైన చిత్రాలను తీయటంతో పాటు ఉన్నత ప్రమాణాలతో కూడిన 720(పి) వీడియో రికార్డింగ్ కు సహకరిస్తుంది. 4 జీబీ మెమరీ సామర్థ్యం గల ఈ మొబైల్ హైక్రో ఎస్ డీ మెమరీ కార్డు స్లాట్ సహకారంతో జీబీని 32కు పెంచుకునే ఉంది. నాణ్యతతో కూడిన బ్యాటరీ బ్యాకప్ రెండు రోజుల పైనే ఛార్జింగ్ నిస్తుంది.

బ్లూటూత్, వై -ఫై, జీపీఆర్ ఎస్, ఎడ్జ్ వంటి ఆప్షన్లు ఇమిడి ఉన్న ఈ మొబైల్ కు హై స్పీడ్ 3జీ, 4జీలను కనెక్టు చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థతో నడిచే ఈ స్మార్ట్ ఫోన్ సమంజసమైన ధరతో ఈ ఏడాది చివరిలో మార్కెట్లోకి రానుంది.

The notable LG Bryce features:

Android OS
4G connectivity
3G, Wi-Fi
5 Mega Pixel camera with 720p Video recording
Music and video playback
HDMI out
Java

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X