Home
Mobile

5 కెమెరాలతో దూసుకొస్తున్న LG V40

కొరియా ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ దిగ్గజమైన LG మరో స్మార్ట్ ఫోన్ LG V40ను లాంచ్ చేయబోతుంది.

By Anil

కొరియా ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ దిగ్గజమైన LG మరో స్మార్ట్ ఫోన్ LG V40ను లాంచ్ చేయబోతుంది. కాగా LGV30 విజయవంతమైన నేపధ్యంలో ఈ సిరీస్ కు కొనసాగింపుగా LG V40 స్మార్ట్ ఫోన్ ను విడుదలకు ప్లాన్ చేస్తుంది .ఇందులోని ప్రత్యకత ఏంటంటే 5 కెమెరాలను ఫోన్లో అమర్చుతున్నట్టు తెలుస్తోంది .అదే నిజమైతే 5 కెమెరాలతో వస్తున్న మొదటి స్మార్ట్ ఫోన్ ఇదే అవుతుంది.ఫోటోగ్రఫీ అంటే మక్కువ ఉన్నవారికి ఈ ఫోన్ చాలా ఉపయోకరంగా ఉంటుంది . అయితే మొబైల్ ధర ఎంత ఉంటుందో అనేది ఇంకా రివీల్‌ కాలేదు.

lg v40

కెమెరా ప్రత్యక ఆకర్షణ:

అందిన రిపోర్ట్ ప్రకారం ఈ ఫోన్ లోని ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో రెండు కెమెరాలను కలిగి ఉంటుంది అందులో ఒక సెన్సార్ పేస్ unlock చేయడానికి సపోర్ట్ చేస్తుంది. 3D పేస్ మాపింగ్ టెక్నాలజీని కూడా ఈ ఫోన్ లో ఉపయోగించవచ్చు.వెనుక రేర్ ఫేసింగ్ కెమెరా లో ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇధీ వైడ్ అంగెల్ లెన్స్ ,అల్ట్రా అంగెల్ లెన్స్ గా పనిచేస్తుంది అయితే ఇంకొకటి ఎందుకు పొందుపరిచారో సమాచారం లేదు. అయితే Huawei P20 Pro లో అమర్చిన తరహాలా ఇందులో కూడా అమర్చారు అని సమాచారం

lg v40

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ తో :

ఈ స్మార్ట్‌ఫోన్‌కు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ ఓ హైలైట్‌గా నిలుస్తుంది. సౌండ్ కోసం క్వాడ్ DAC తో వస్తుంది. ఇందులో Google అసిస్టెంట్ కోసం ఒక ప్రత్యేక బటన్ కలిగి ఉంటుంది.

lg v40

LG V సిరీస్ :

ఇప్పటివరకు వచ్చిన LG V సిరీస్ ఫోన్స్ అన్ని మార్కెట్ లో అమ్మకాలని కొల్లగొట్టేసింది .అదే విధంగా LG V40 లో ప్రత్యక ఆకర్షణగా 5 కెమెరాలు పెడితే ఈ ఫోన్ కూడా అమ్మకాల్లో దూసుకుపోతుందని కంపెనీ భావిస్తుంది.

lg v40

లాంచ్ ఎప్పుడు:

ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ మరియు ధర ఫై కంపెనీ ఎటువంటి ప్రక్కన చేయలేదు . అయితే వచ్చే ఏడాది లో లాంచ్ అవొచ్చు అని పుకార్లు షికారు చేస్తున్నాయి . కాగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఇప్పటి వరకు 5 కెమెరాలతో ఫోన్ రాలేదు వస్తే LG V40 మొదటి ఫోన్ అవుతుంది. ఈ ఫోన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో విడుదలవ్వగానే అమ్మకాలలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
LG planning to throw in five cameras with its V40.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X