ఎల్‌జీ ప్రాడా స్మార్ట్ ఫోన్!!

Posted By: Prashanth

ఎల్‌జీ ప్రాడా స్మార్ట్ ఫోన్!!

 

సాంకేతిక మరియు ఎలక్ర్టానిక్ వస్తు వ్యాపారంలో ఎల్‌జీ క్రీయాశీలక పాత్ర పోషిస్తోంది. వినియోగదారుల అవసరాలను తీర్చటంలో ఈ బ్రాండ్ పూర్తి స్థాయిలో సఫలీకృతమవుతుంది. ఎల్‌జీ తాజాగా రూపొందించిన స్మార్ట్ ఫోన్ ‘ప్రాడా 3.0’ ప్రస్తుత మార్కెట్లో చర్చనీయాంశంగామారింది..

ఆండ్రాయిడ్ 2.3 వర్షన్ జింజర్ బోర్డ్ వోఎస్ పై ఫోన్‌ రన్ అవుతుంది. 4.3 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే 480 x 800 పిక్సల్ రిసల్యూషన్ కలిగి ఉంటుంది. నిక్షిప్తం చేసిన 1000 MHz డ్యూయల్ కోర్ T1 OMAP 4430 ప్రాసెసర్ డివైజ్ పనితీరును వేగవంతం చేస్తుంది.

కనెక్టువిటీ అంశాలను పరిశీలిస్తే బ్లూటూత్, యూఎస్బీ, 802.11 b/ g/ n Wi-Fiలు డేటా ట్రాన్సఫరింగ్‌ అదేవిధంగా వేగవంతమైన నెట్ బ్రౌజింగ్‌కు దోహదపడతాయి. 1540 mAh రీఛార్జబల్ లితియమ్ ఐయాన్ బ్యాటరీ బ్యాటరీ దీర్ఘకాలిక బ్యాకప్‌‌నిస్తుంది.

8000MB ఇంటర్నల్ మెమరీ ముఖ్యమైన డేటాను పదిలంగా సేవ్ చేస్తుంది. యూట్యూబ్ ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో అప్లికేషన్‌లను డివైజులో ముందుగానే బలపరిచారు. కెమెరా స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే 8 మెగా పిక్సల్ రేర్, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు నాణ్యమైన ఫోటోలను చిత్రీకరించేందుకు దోహదపడతాయి, హై డెఫినిషన్ వీడియో ప్లేబ్యాక్ రికార్డింగ్ ఆప్షన్ పూర్తి స్థాయి వినోదాన్ని అందిస్తుంది. GSM 900/1800MHz నెట్‌వర్క్‌ను మొబైల్ సపోర్ట్ చేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot