Home
Mobile

ఎల్‌జీ అధికారిక ప్రకటన!!

By Super
LG Prada 3.0


సాంకేతిక మరియు ఎలక్ర్టానిక్ వస్తు వ్యాపారంలో ఎల్‌జీ క్రీయాశీలక పాత్ర పోషిస్తోంది. వినియోగదారుల అవసరాలను తీర్చటంలో ఈ బ్రాండ్ పూర్తి స్థాయిలో సఫలీకృతమవుతుంది. ఎల్‌జీ తాజాగా రూపొందించిన స్మార్ట్ ఫోన్ ‘ప్రాడా 3.0’ (Prada 3.0) ప్రస్తుత మార్కెట్లో హాట్ టాపిక్..

ఆండ్రాయిడ్ 2.3 వర్షన్ జింజర్ బోర్డ్ ఆపరేటింగ్ సిస్టంను ఈ స్మార్ట్ ఫోన్‌లో నిక్షిప్తం చేశారు, 4.3 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే 480 x 800 పిక్సల్ రిసల్యూషన్ కలిగి ఉంటుంది. శక్తివంతమైన 1000 MHz డ్యూయల్ కోర్ T1 OMAP 4430 ప్రాసెసింగ్ వ్యవస్థను లోడ్ చేశారు.

కనెక్టువిటీ అంశాలను పరిశీలిస్తే బ్లూటూత్ అదేవిధంగా యూఎస్బీ, 802.11 b/ g/ n Wi-Fi కనెక్టువిటీ అంశాలు వేగవంతమైన డేటా ట్రాన్సఫరింగ్‌కు దోహదపడతాయి. మొబైల్‌లో ఏర్పాటు చేసిన 3.5 mm ఆడియో జాక్ ద్వారా ఇతర ఆడియో డివైజులకు కనెక్ట్ చేసుకోవచ్చు.

1540 mAh రీఛార్జబల్ లితియమ్ ఐయాన్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఈ బ్యాటరీ దీర్ఘకాలిక బ్యాకప్‌ను అందిస్తుంది. 8000 MB ఇంటర్నల్ స్టోరేజి మెమరీ వినియోగదారుడికి మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది. యూట్యూబ్ ప్లేయర్, అదే విధంగా ఎఫ్ఎమ్ రేడియో వ్యవస్థలను డివైజులో ముందుగానే లోడ్ చేశారు. కెమెరా స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే 8 మెగా పిక్సల్ రేర్, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు నాణ్యమైన చిత్రాలు తీసుకునేందుకు దోహదపడతాయి, హై డెఫినిషన్ వీడియో ప్లేబ్యాక్ రికార్డింగ్ ఆప్షన్ పూర్తి స్థాయి వినోదాన్ని పంచుతుంది.

ఈ మొబైల్ GSM 900/1800 MHz నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, హెచ్డీఎమ్ఐ ఇన్‌పుట్ పోర్ట్, మైక్రో యూఎస్బీ ఛార్జింగ్ కనెక్టర్, గ్లోబల్ రోమింగ్, యాక్సిలరోమీటర్ తదితర అప్లికేషన్లను ‘ఎల్‌జీ ప్రాడా 3.0’

స్మార్ట్‌ ఫోన్లో లోడ్ చేశారు. ధర, విడుదల తదితర వివరాలను వెల్లడించాల్సి ఉంది.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X