చావో.. రేవో సిద్దమైన ఎల్‌జీ, హెచ్‌టిసి

Posted By: Staff

చావో.. రేవో సిద్దమైన ఎల్‌జీ, హెచ్‌టిసి

 

వన్ ఇండియా పాఠకుల కొసం మార్కెట్లో సక్సెస్ సాధించిన మొబైల్ ఫోన్స్ మధ్య ఉన్న తేడాలను ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది. అందుకు కారణం కొంత మంది యూజర్స్‌కు ఎటువంటి మొబైల్ ఖచ్చితంగా సరిపోతుందో తెలియని పరిస్దితిలో ఇలాంటి ఆర్టికల్స్ వారికి ఏమైనా కొంత వరకు సహాయపడగలవనే ఉద్దేశ్యంతో అందించడం జరుగుతుంది. ఈ రోజు పాఠకులకు ఎల్‌జీ కంపెనీ నుండి 'ఎల్‌జీ ప్రాడా కె2' అదే విధంగా హెచ్‌టిసి నుండి 'హెచ్‌టిసి టైటాన్‌'కు సంబంధించిన సమాచారం అందించడం జరుగుతుంది.

రెండు మొబైల్స్ కూడా టచ్ స్క్రీన్ ఫెసిలిటీతో యూజర్స్‌ని రంజింప చేస్తున్న విషయం తెలిసిందే. రెండు మొబైల్స్ కూడా క్యాండీ బార్ మోడల్‌కు చెందినవి. హెచ్‌టిసి టైటాన్ 4.7 ఇంచ్ డిస్ ప్లేని కలిగి ఉంటే, ఎల్‌జీ ప్రాడా 4.3 ఇంచ్ డిస్ ప్లేని కలిగి ఉంది. హెచ్‌టిసి మొబైల్‌ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుగు గాను 1.5GHz క్వాలికామ్ MSM 8255 స్నాప్ డ్రాగెన్ చిప్‌సెట్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. హెచ్‌టిసి టైటాన్ మొబైల్ మైక్రోసాప్ట్ విండోస్ మ్యాంగ్ 7.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. అదే ఎల్‌జీ ప్రాడా మొబైల్ ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపేరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.

ఎల్‌జీ ప్రాడా కె2 మొబైల్ ప్రత్యేకతలు:

* డిస్ ప్లే స్క్రీన్ సైజు: 4.3 inches

* స్క్రీన్ రిజల్యూషన్: 480 × 800 Pixels

* డిస్ ప్లే కలర్: IPS LCD Capacitive TouchScreen

* కెమెరా సైజు: 8.0 Mega Pixels

* కెమెరా రిజల్యూషన్: 3264 × 2448 Pixels

* కెమెరా ఫీచర్స్: Geo tagging, Video, Auto focus

* సెకండరీ కెమెరా: 1.3 Mega Pixels

* ఆడియో జాక్:3.5mm Headphone Jack

* MP3, WAV Ring tones, Vibration

* MP3, MP4 Player

* డేటా కనెక్టివటీ: Bluetooth v3.0, Micro USB v2.0, Wi-Fi 802.11 b/g/n, GPS

* ఇంటర్నెట్ కనెక్టివిటీ: 3G, GPRS, EDGE, HTML Internet Browsing

* ఇంటర్నల్ మెమెరీ: 16GB Storage

* విస్తరించుకునే మెమరీ: Up to 32GB with Micro/SD Card slot

* బ్యాటరీ మోడల్: Li-Ion Standard Battery

 

హెచ్‌టిసి టైటాన్ మొబైల్ ప్రత్యేకతలు:

* 2జీ నెట్‌వర్క్:GSM 850 / 900 / 1800 / 1900

* 3జీ నెట్‌వర్క్:WCDMA 850 / 900 / 2100

* బరువు:159 g

* చుట్టుకొలతలు:    5.2" x 2.7" x 0.39" (132 x 69 x 9.9 mm)

* డిస్ ప్లే టైపు:LCD (Color TFT/TFD)

* డిస్ ప్లే రిజల్యూషన్:480 x 800 pixels

* డిస్ ప్లే స్క్రీన్ సైజు: 4.7 inches

* ఆపరేటింగ్ సిస్టమ్:Windows Phone (7), version 7.5 (Mango)

* ప్రాసెసర్:    1.5 GHz Qualcomm Snapdragon

* మెమరీ:     16 GB internal storage, raw hardware

* బ్యాటరీ:1600 mAh LiIon

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot