స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోకి దూసుకొస్తున్న ఎల్‌జీ Q Stylus+
స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో దూసుకుపోతున్న దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జీ విపణిలోకి ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.
స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో దూసుకుపోతున్న దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జీ విపణిలోకి ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.ఎల్‌జీ Q Stylus+పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. కంపెనీ దీని ధరను రూ . 21,990 గా నిర్ణయించింది. Aurora Black ,Moroccan Blue రంగుల్లో అందుబాటులో ఉంటుంది . సెప్టెంబరు 5 నుంచి ఎల్‌జీ Q Stylus+ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని కంపనీ వెల్లడించింది.ఈ ఫోన్ యొక్క ప్రధాన ఫీచర్ stylus సపోర్ట్ తో రాబోతుంది. ఈ stylus చేతితో వ్రాసిన ఇన్ ఫుట్ వస్తుంది మరియు ఇందులో ఇంటెలిజెంట్ పామ్ రిజెక్షన్ ఉంది .

LG Q Stylus+ ఫీచర్స్...
6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్,2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ,క్విక్ చార్జ్ 3.0, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి.

ధర...
కంపెనీ ఈ ఎల్‌జీ Q Stylus+ స్మార్ట్ ఫోన్ ధరను రూ . 21,990 గా నిర్ణయించింది. Aurora Black ,Moroccan Blue రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

6.2 ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే....
ఇందులో 6.2 ఇంచ్ సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఫిక్సల్ రిజల్యూషన్ 2160 x 1080 గా ఉంది. యూజర్లకు మంచి వ్యూయింగ్ అనుభూతిని కలిగించేదుకు ఈ భారీ డిస్‌ప్లే తోడ్పడనుంది.

కెమెరా విషయానికొస్తే....
వెనుక భాగంలో 16 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న కెమెరాను ఇచ్చారు. కాగా ఈ కెమెరా ఎల్ ఈడి ఫ్లాష్ లైటుతో వచ్చింది . దీని ద్వారా ఫోటో తీసుకున్నప్పుడు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ముందు భాగం లో సెల్ఫీస్ మరియు వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు .

ప్రాసెసర్,ర్యామ్,స్టోరేజ్...
ఈ స్మార్ట్‌ఫోన్‌కు 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ఓ హైలైట్‌గా నిలుస్తుంది. దీనికి తోడు 4 జీబి ర్యామ్, 64 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ప్రాసెసింగ్ అలానే మల్టీటాస్కింగ్ విభాగాలను మరింత బలోపేతం చేస్తాయి.

బ్యాటరీ, సాఫ్ట్‌వేర్....
ఎల్‌జీ Q Stylus+ హ్యాండ్‌సెట్‌కు 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ యూనిట్ ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది.ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైస్ రన్ అవుతుంది.

మంచి ఆడియో ఇన్ ఫుట్ తో లోడ్ అయ్యి ఉంది...
హెడ్ ఫోన్స్ లో మ్యూజిక్ వినేటప్పుడు మంచి అనుభూతిని పొందడానికి DTS: X వరకు 7.1 ఛానల్ 3D సరౌండ్ సౌండ్ ఈ హ్యాండ్ సెట్ లో కల్పించారు.


Click it and Unblock the Notifications








