ఎల్‌జీ నుంచి మరో సంచలన ఫోన్

సౌత్ కొరియా బ్రాండ్ LG ఇటీవల తన Q6 స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ ఇండియా ద్వారా మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ ఫోన్‌కు అప్‌డేటెడ్ మోడల్ అయిన Q6+ను LG మార్కెట్లోకి తీసుకురాబోతోన్నట్లు ముంబైకు చెందిన ప్రముఖ రిటైలర్ మహేష్ టెలికామ్ తన అఫీషియల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

ఎల్‌జీ నుంచి మరో సంచలన ఫోన్

Read More : సెప్టంబర్ 5న ఇండియాకు Mi 5X, మొదటి డ్యుయల్ కెమెరా ఫోన్

ఈ ఫోన్ ఆఫ్‌లైన్ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంటుందట. సెప్టంబర్ 5వ తేదీలోపు ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. LG Q6+ స్మార్ట్‌ఫోన్‌కు ఫుల్ విజన్ డిస్‌ప్లే ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది. ఫోన్ ఇతర స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ ఫుల్ విజన్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ 2160 x 1080పిక్సల్స్, పిక్సల్ డెన్సిటీ ఆఫ్ 442 పీపీఐ), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, Qualcomm Snapdragon 435 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 mAh బ్యాటరీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఫోన్ బరువు 149 గ్రాములు, చుట్టుకొలత 142.5 x 69.3 x 8.1. మార్కెట్లో LG Q6 ధర రూ.14,999గా ఉంది. LG Q6+ ధర మార్కెట్లో ఎంతుంటుందనేది తెలియాల్సి ఉంది.

English summary
LG Q6+ launching in India soon. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot