LG Q6.. బడ్జెట్ ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ తన మొట్టమొదటి క్యూ సిరీస్ స్మార్ట్‌ఫోన్ LG Q6ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది ధర రూ.14,990. హైఎండ్ లుక్‌కు అద్దం పట్టే విధంగా ఫుల్ విజిన్ డిస్‌ప్లే టెక్నాలజీతో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లో బెస్ట్ ఫీచర్లతో ప్యాక్ అయి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ క్లాస్ మొబైల్ ఫోన్ ఎక్స్‌పీరియన్స్‌..

ఫేషియల్ రిక్నగిషన్ టెక్నాలజీ, మిలటరీ గ్రేడ్ డ్యూరబులిటీ, శక్తివంతమైన హార్డ్‌వేర్ వంటి అత్యుత్తమ ఫీచర్లు బెస్ట్ క్లాస్ మొబైల్ ఫోన్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

ఫుల్‌విజన్ డిస్‌ప్లే టెక్నాలజీ

ఎల్‌జీ జీ6 ప్రేరణతో రూపుదిద్దుకున్న LG Q6 స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ధర పాయింట్లోనూ ఫుల్‌విజన్ డిస్‌ప్లే టెక్నాలజీతో రావటం విశేషం. ఈ ఫోన్‌లో ఏర్పాటు 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ ఫుల్‌విజన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ2160 x 1080పిక్సల్స్) యూజర్ వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను కొత్త లెవల్‌కు తీసుకువెళుతుంది.

వీడియో బ్రౌజింగ్‌, గేమింగ్ ఇంకా మల్టీ టాస్కింగ్‌ భేష్

18:9 కారక నిష్పత్తిని కలిగి ఉండే ఈ డిస్‌ప్లేలో వీడియో బ్రౌజింగ్‌, గేమింగ్ ఇంకా మల్టీ టాస్కింగ్‌ భేష్ అనిపించేలా ఉంటుంది. ఎల్‌‌జీ క్యూ6 స్మార్ట్‌ఫోన్‌కు bezel-less ఫ్యాక్టర్ మరో అదనపు ప్లస్ పాయింట్.

7000 సిరీస్ అల్యూమినియమ్ మెటల్

ఎల్‌‌జీ క్యూ6 స్మార్ట్‌ఫోన్‌ ఫుల్ మెటల్ బాడీతో వస్తున్నప్పటికి ఏమాత్రం బరువనిపించదు. చేతిలో కంఫర్ట్‌గా ఇమిడిపోతుంది. మరింత ధృడంగా కనిపించే ఈ ఫోన్ బాడీని 'H Beam' ఫ్రేమ్‌తో తీర్చిదిద్దారు. ఈ ఫ్రేమ్‌ను 7000 సిరీస్ అల్యూమినియమ్ మెటల్ నుంచి తీసుకోవడం విశేషం.

ఇంప్రూవుడ్ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ

ఎల్‌‌జీ క్యూ6 స్మార్ట్‌ఫోన్‌‌లో హైసెక్యూరిటీ స్టాండర్డ్స్‌తో కూడిన బయోమెట్రిక్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో ముందస్తుగానే లోడ్ చేసి ఉంచిన ఇంప్రూవుడ్ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా ఫోన్‌ను వేగంగా అన్ లాక్ చేయవచ్చు. ఇందుకుగా ఎటువంటి ప్యాట్రన్స్, స్వైపింగ్, టైపింగ్ ఇంకా పిన్ కోడ్స్‌ను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ఫోన్‌ను అన్‌లాక్ చేసే క్రమంలో ఫ్రంట్ కెమెరాను మీ ముఖానికి దగ్గరగా ఉంచితే చాలు, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ మీ ముఖాన్ని గుర్తించి ఫోన్‌ను వెంటనే అన్‌లాక్ చేస్తుంది.

100 డిగ్రీ ఫీల్డ్ వ్యూతో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా..

కెమెరా విషయానికి వచ్చేసరికి ఎల్‌‌జీ క్యూ6 స్మార్ట్‌ఫోన్‌‌ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 100 డిగ్రీ ఫీల్డ్ వ్యూను కలిగి ఉండటం విశేషం. ఈ ఫీచర్ ఎక్కువు మంది సభ్యులను ఒకే ఫ్రేమ్‌లో కనిపించేలా చేస్తుంది. ఫ్రంట్ కెమెరాతో తీసిన సెల్ఫీలను సోషల్ మీడియాలో షేర్ చేసేందుకుగాను ఇన్‌స్టెంట్ సోషల్ షేరింగ్ ఫీచర్స్ ఫోన్ కెమెరా యాప్‌లో ఉన్నాయి. ఎల్‌‌జీ ఎక్స్‌క్లూజివ్ స్క్వేర్ కెమెరా ఫీచర్ ద్వారా నాలుగు ప్రత్యేకమైన షాట్ మోడ్‌లలో ఫోటోలను క్యాప్చుర్ చేసుకునే వీలుంటుంది.

శక్తివంతమైన హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్..

ఎల్‌‌జీ క్యూ6 స్మార్ట్‌ఫోన్‌‌ శక్తివంతమైన ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 435 పై రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్‌కు జతగా ఉండే అడ్రినో 505 జీపీయూ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది. వేగవంతమైన మల్టీ టాస్కింగ్ కోసం 3జీబి ర్యామ్‌ను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసారు. స్టోరేజ్ అవసరాల కోసం 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌ అందుబాటులో ఉంటుంది. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2TB వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

శక్తివంతమైన బ్యాటరీ యూనిట్..

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ 3,000mAh బ్యాటరీ యూనిట్‌తో ప్యాక్ అయి ఉంటుంది. 4జీ, వై-ఫై 802.11 b,g,n, బ్లుటూత్ 4.2, యూఎస్బీ టైప్ - బీ 2.0 వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్స్ ఈ డివైస్‌లో ఉన్నాయి.

ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి ఎల్‌‌జీ క్యూ6 స్మార్ట్‌ఫోన్‌‌ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఈ ఆపరేటింగ్ సిస్టంతో పాటుగా వచ్చే ఎల్‌జీ యూఎక్స్ 6.0 లేయర్ మరిన్ని సౌకర్యాలను చేరవచేస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లో బెస్ట్ ఫీచర్లతో ప్యాక్ అయి ఉన్న ఎల్‌‌జీ క్యూ6 స్మార్ట్‌ఫోన్‌ Amazon.inలో ఎక్స్‌క్లూజివ్‌గా ట్రేడ్ అవుతోంది. ధర రూ.14,490.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LG Q6: Most Interesting and feature packed budget smartphone in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot