‘మెగా కాంభినేషన్’ పై భారీ అంచనాలు!

Posted By: Staff

 ‘మెగా కాంభినేషన్’ పై భారీ అంచనాలు!

ఆండ్రాయిడ్, క్వాడ్‌కోర్, 4జీ ఎల్‌టీఈ నెట్‌వర్క్‌ల కలయకలో ఓ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను ఎల్‌జీ వృద్ధి చేస్తోందని మార్కెట్ వర్గాల టాక్. హ్యాండ్‌సెట్ మోడల్ నంబరు ఎల్‌ఎస్970. మెగా కాంభినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ హై‌ఎండ్ ఫోన్ 2012 చివరినాటికి అందుబాటులోకి రానుందని విశ్వసనీయవర్గాలు ఉటంకించాయి. ఈ సమాచారం హడావుడి చేస్తున్న నేపధ్యంలో ఎల్‌జీ ప్రేమికులు మరింత ఉత్సకతకు లోనవుతున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ పై ఎల్‌జీ భారీ ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం.

ఎల్‌జీ ఎల్‌ఎస్970 కీలక ఫీచర్లు:

1.5గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,


4.7 అంగుళాల హైడెఫినిషన్ రిసల్యూషన్ స్ర్కీన్,


ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

నిట్రో హై డెఫినిషన్ ఫోన్‌ను తలపించే విధంగా ఈ సరికొత్త హ్యాండ్‌సెట్ తీరు ఉంటుందట. ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేసిన ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, శక్తివంతమైన క్వాడ్‌కోర్ ప్రాసెసర్ అదేవిధంగా 4జీ ఎల్‌టీఈ నెట్‌వర్క్ వ్యవస్థలు యూజర్‌కు అత్యుత్తమ మొబైలింగ్ అనుభూతిని కలిగిస్తాయి. ప్రతిష్టాత్మకంగా ఎల్‌జీ డిజైన్ చేస్తున్న ‘ఎల్‌జీ ఎల్‌ఎస్970’ ఫీచర్లను బట్టి అంచనావేస్తే ‘ఇవో 4జీ ఎల్‌టీఈ’స్మార్ట్‌ఫోన్‌తో పోటీ పడగల సామర్ధ్యాన్ని కలిగి ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు.


Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot