ఎల్‌జీ ఆప్టిమస్ 3డి కోసం రిలయన్స్ 3జీ ప్లాన్స్

Posted By: Staff

ఎల్‌జీ ఆప్టిమస్ 3డి కోసం రిలయన్స్ 3జీ ప్లాన్స్

ఇండియాలోకి 3జీ నెట్ వర్క్ వచ్చిన తర్వాత 3జీ మొబైల్ ఫోన్స్‌ని విరివిగా వాడుతున్నారు. 3జీ వల్ల ఉండే ఉపయోగాలను జనాభా బాగా సద్వినియోగం పరుచుకుంటున్నారనడంలో ఎటువంటి సందేహాం లేదు. యాజర్స్ కోసం ఆపరేటర్స్ కూడా(రిలయన్స్) తక్కువ ధరలకే ఈ 3జీ సర్వీస్‌లను అందిస్తున్నారు. రిలయన్స్, ఎల్‌జీ భాగస్వామ్యంలో ఎల్‌జీ ఆప్టిమస్ 3డి మొబైల్ కోసం ప్రత్యేకంగా కొత్త 3జీ ప్లాన్స్‌ని రిలయన్స్ విడుదల చేయనుంది.

యూజర్స్ కొసం రిలయన్స్ కొత్తగా మనీ బ్యాక్ ప్లాన్స్‌ని ప్రారంభించింది. ఈ మనీ బ్యాక్ ప్లాన్స్‌ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ యూజర్స్ కొసం ప్రత్యేకంగా ఆఫర్ చేయడం జరిగింది. రెండు సంవత్సరాలకు గాను రిలయన్స్ అందించే మనీ బ్యాక్ ఎంతంటే అక్షరాలా రూ 33,000. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఇండియన్ జనాభా స్మార్ట్ పోన్స్‌వైపు ఆసక్తి చూపడంతో 3జీ సెగ్మెంట్లో యూజర్స్‌కు చక్కని ఆఫర్స్ అందించాలనే ఉద్దేశ్యంతో ఈ మనీ బ్యాక్ ప్లాన్‌ని ప్రారంభించడం జరిగిందన్నారు.

ఈ మనీ బ్యాక్ ప్లాన్‌ని రిలయన్స్ కేవలం ఒక్క ఎల్‌జీ ఆప్టిమస్ 3డి మొబైల్‌కే ప్రారంభించడం జరిగింది. ఈ ఆఫర్ ద్వారా ఎవరైతే కస్టమర్స్ రిలయన్స్ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కనెక్షన్స్‌ని తీసుకుంటారో వారు రిలయన్స్ టు రిలయన్స్, రిలయన్స్ టు వేరే నెట్ వర్క్స్, ఎస్‌ఎమ్‌ఎస్ ప్యాకేజిలను పోందుతారు. అంతేకాకుండా స్పెషల్ 3డీ బెనిఫిట్స్‌తో పాటు, డేటా, వీడియో కాల్స్, మొబైల్ టివి లాంటివి పొందడం జరుగుతుందని తెలియజేశారు. ఎల్‌జీ కంపెనీ విడుదల చేసిన ఎల్‌జీ ఆప్టిమస్ 3డి ఫీచర్స్‌ని క్లుప్తంగా పరిశీలించినట్లేతే ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఎల్‌జీ ఆప్టిమస్ 3డి మొబైల్ ఫీచర్స్:

* 4.3-inch WVGA glasses-free display
* First stereoscopic 3D screen
* 1GHz TI OMAP 4 dual-core processor
* Full HD with HDMI and DLNA
* Dual 5MP cameras on the back for 3D
* 8GB memory and 4GB LP DDR2
* HSPA+, DLNA/HDMI 1.4
* 2D: 1080p, MPEG/H.264 recording and playback
* 3D: 720p, H.264 SEI recording and playback
* 1500mAh battery

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot