3జి పోయింది, మార్కెట్లోకి 4జి మొబైల్ ఫోన్స్

Posted By: Super

3జి పోయింది, మార్కెట్లోకి 4జి మొబైల్ ఫోన్స్

ఇండియా మొబైల్ మార్కెట్లో ఇటీవలే 3జి సర్వీస్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు 3జి మొబైల్స్‌ని విడుదల చేసినటువంటి మొబైల్ హ్యాండ్ సెట్ తయారీ దార్లు ఇప్పుడు మరో కొత్త టెక్నాలజీని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. ఏమిటి ఆ కొత్త టెక్నాలజీ అని అనుకుంటున్నారా.. అదేనండీ 4జి, 5జి సర్వీస్‌లు. ఇప్పటికే మార్కెట్లోకి విడుదలై హాల్ చల్ చేస్తున్నటువంటి రెండు 4జి మొబైల్స్‌కి సంబంధించిన సమాచారం చూద్దాం. ఆ రెండు మొబైల్స్ ఏమిటంటే ఎల్‌జి రివల్యూషన్, శ్యామ్‌సంగ్ ఇన్ ప్యూస్.

ఈ రెండు మొబైల్స్ కూడా హై ఎండ్ స్మార్ట్ పోన్స్. రెండు మొబైల్స్ కూడా చూడడానికి చాలా స్టన్నింగ్ బ్యూటీ లుక్ వీటి సొంతం. సాధారణంగా ఎవరైతే స్టయిల్ యాససరీస్‌ని ఇష్టపడతారో వారిని దృష్టిలో పెట్టుకోని ఈ రెండు మొబైల్స్ విడుదల చేయడం జరిగింది. ఎల్‌జి రివల్యూషన్‌తో పొల్చితే శ్యామ్ సంగ్ ఇన్ ప్యూస్ చాలా పోడవుగా, స్లిమ్‌‌గా ఉంటుంది. ఇక బరువు విషయానికి వస్తే ఎల్‌జి రివల్యూషన్‌ 172 గ్రా ఉండగా అదే శ్యామ్ సంగ్ ఇన్ ప్యూస్ కేవలం 139 గ్రా మాత్రమే. ఇక డిప్లే విషయానికి వస్తే శ్యామ్ సంగ్ ఇన్ ప్యూస్ 4.5 ఇంచ్ Amoled screen కాగా, అదే ఎల్‌జి రివల్యూషన్‌ 4.3 ఇంచ్ TFT screen. ఇక రెండు ఫోన్స్ కూడా 480*800 రిజల్యూషన్‌ని కలిగి ఉన్నాయి.

మల్టీమీడియా విషయానికి వస్తే రెండు మొబైల్స్ కూడా ఒకేవిధమైన ఫీచర్స్‌ని కలిగి ఉన్నాయి. రెండు మొబైల్స్‌లలో కూడా ముందు భాగాన 1.3 మెగా ఫిక్సల్ కెమెరా, ఆటో ఫోకస్, ఎల్‌ఈడి ఫ్లాష్ వీటి సొంతం. శ్యామ్ సంగ్ ఇన్ ప్యూస్ వెనుక భాగాన ఉన్న కెమెరా 8 మెగా ఫిక్సల్ కాగా, అదే ఎల్‌జి రివల్యూషన్ వెనుక భాగన ఉన్న కెమెరా 5 మెగా ఫిక్సల్. ఇక రెండు మొబైల్స్ కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోనే రన్ అవుతాయి. శ్యామ్ సంగ్ ఇన్ ప్యూస్‌లో అండ్రాయిడ్ ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టమ్ కాగా, అదే ఎల్‌జి రివల్యూషన్‌లో ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతున్నాయి.

ఇక ప్రాసెసర్స్ విషయానికి వస్తే శ్యామ్ సంగ్ ఇన్ ప్యూస్‌లో RM Cortex 1.2Ghz processor కాగా అదే ఎల్‌జి రివల్యూషన్‌లో 1GHz Qualcomm Snap Dragon ప్రాసెసర్ ఉంది. రెండు మొబైల్స్ కూడా ఇంటర్ననల్‌గా 512MB RAMని కలిగి ఉన్నాయి. మొమొరీ రెండు మొబైల్స్‌లలో ఇంటర్నల్‌గా 16జిబి ఉండగా విస్తరించుకునేందుకు 32జిబి వరకు సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం మార్కట్లో కొత్త కనెక్టివిటీ టెక్నాలజీలు అయినటువంటి WLAN, DLNA and Bluetooth 3.0 అన్నింటిని ఇది సపోర్ట్ చేస్తాయి.

ప్రస్తుతం భారతదేశంలో స్మార్ట్ పోన్స్ మీద యూత్‌కి బాగా మోజు ఉంది. దాంతో మంచి టెక్నాలజీ ఉన్న మొబైల్ గనుక లభిస్తే ఖరీదు విషయంలో ఎటువంటి రాజీ పడడం లేదు. ధర విషయంలో గనుక చూసుకున్నట్లైతే ఎల్‌జి రివల్యూషన్ కంటే కూడా శ్యామ్ సంగ్ ఇన్ ప్యూస్ బెటర్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot