మధ్యతరగతి మార్కెట్ ను కొల్లగొట్టేందుకు త్వరలో ‘ ఎల్ జీ S365 ’..!!

Posted By: Super

మధ్యతరగతి మార్కెట్ ను కొల్లగొట్టేందుకు త్వరలో ‘ ఎల్ జీ S365 ’..!!

మధ్యతరగతి మొబైల్ సెక్టార్‌ను కొల్లగొట్టేందుకు ఎల్‌జీ 'LG S365" మరో అస్త్రాన్ని సంధించనుంది. మొబైల్ వ్యాపారానికి స్వర్గధామం లాంటి 'ఇండియా"లో ఎల్‌జీ మన్నికతో కూడిన అతి తక్కువ ధర కలిగిన 'LG A190" మోడల్‌ మొబైల్‌ను మార్కెట్ల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే విడుదలైన 'LG A190"కి వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన లభించటంతో.. ఎల్‌జీ వెనువెంటనే 'LG S365"ను అతిత్వరలో మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

విడుదల కాబోతున్న 'S365" ఫీచర్లను మనం పరిశీలిస్తే డ్యూయల్ సిమ్ (జీఎస్ ఎమ్ + జీఎస్ఎమ్) సౌలభ్యత కలిగి ఉంటుంది. ఇక డిస్‌ప్లే విషయాన్ని పరిశీలిస్తే 2.4mm వైశాల్యం కిలిగి టీఎఫ్టీ స్వభావం కలిగి ఉంటుంది. అయితే ఈ ఫోన్‌కు అనుసంధానించిన 2.0 మెగా పిక్సల్ కెమెరా డిజిటల్ జూమ్ ఫీచర్ కలిగి 1600 X 1200 పిక్సల్ సపోర్టు చేస్తుంది. ఆడియో, వీడియో రికార్డింగ్ ఆప్షన్లు ఇందులో పొందుపరిచారు. 'S365" వివిధ వేరియంట్లను సపోర్టు చేస్తుంది.

ఓపెరా మినీ 5 బ్రౌసర్ వ్యవస్థ ఆధారితంగా 'S365" పని చేస్తుంది. ఇందులో పొందుపరిచిన ఫోన్ బుక్‌లో వెయ్యి ఎంట్రీల వరకు నమోదు చేసుకోవచ్చు. ఇంటర్నల్ మెమరీ 9.7 MB కలిగి ఉండగా, ఎక్సటర్న్‌ల్ ఎస్‌డి విధానం ద్వారా 16GBకి పెంచుకోవచ్చు.

ఇక బ్యాటరీ విషయానికి వస్తే 'S365"లో పొందుపరిచిన శక్తివంతమైన బ్యటారీ 559 గంటల బ్యాకప్ సామర్థ్యం కలిగి ఉంటుంది. నిరంతరాయంగా 14.5 గంటలు పాటు మట్లాడుకోవచ్చు. ఈ ఫోన్‌లో ముందుగా లోడ్ చేసిన సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు ఫేస్ బుక్, ట్విట్టర్ వార్తా ఛానళ్లైన ఎన్డీ‌టివీ వంటి అంశాలు మీకు నిరంతర సమాచారాన్ని అందిస్తాయి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే హ్యాండ్‌సెట్‌లో ఉన్న రేడియా తదితర అంశాలు నాణ్యమైన సంగీతాన్ని మీకు అందిస్తాయి.

ఇక డేటా ట్రాన్స్‌ఫర్ విషయానికి వస్తే జీపీఆర్‌ఎస్, బ్లూటూత్, వైర్‌లెస్ ప్రోటోకాల్, యూఎస్‌బీ పోర్టు వంటి అంశాలు అత్యుత్తమ పనితీరును కనబరుస్తాయి. అయితే ఈ ఫోన్ విడుదలకు సంబంధించి ఇంకా తేదీలు ఖరారు కాలేదు. మార్కెట్లో లభ్యమయ్యే ఈ ఫోన్ ధర రూ. 3940.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot