LG సిగ్నేచర్ ఎడిషన్, వణుకుపుట్టిస్తోన్న స్మార్ట్‌ఫోన్ ధర !
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం LG కొత్తగా సెరామిక్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం LG కొత్తగా సెరామిక్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ కంపెనీ నుంచి సరికొత్తగా సిగ్నేచర్ ఎడిషన్ పేరుతో ఖరీదైన్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ కంపెనీ నుంచి ఈ ఫోన్లు రానున్నాయి. అదీ దక్షిణ కొరియాలో మాత్రమే ఈ ఫోన్లు లభిస్తాయని కంపెనీ తెలిపింది. పూర్తి స్థాయిలో మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందన్న దానిపై కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

ఎల్‌జీ సిగ్నేచర్ ఎడిషన్ ఫీచర్లు
6 ఇంచ్ భారీ ఫుల్ విజన్ డిస్‌ప్లే
1440x2880 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో,
6 జీబీ ర్యామ్
256 జీబీ స్టోరేజ్
2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
16, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా,
3300 ఎంఏహెచ్ బ్యాటరీ

ధర సుమారు రూ.1,18,800
అత్యంత ఖరీదైన ప్రీమియం మెటీరియల్స్‌తో తయారు చేసిన ఈ డివైస్ ధర సుమారు రూ.1,18,800గా ఉండనుంది.

ఎలాంటి ఎలాంటి గీతలు..
జిర్కోనియం సెరామిక్ బ్యాక్ కవర్ పై ఎలాంటి ఎలాంటి గీతలు పడవని కంపెనీ తెలిపింది. ఇది ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌తో పాటు ఈ డివైస్ బ్యాక్ కవర్‌పై ఔత్సాహిక కస్టమర్లు తమ సిగ్నేచర్‌ను ఎన్‌గ్రేవ్ చేయించుకునే అవకాశం ఉంది.

రెండు పవర్ ఫుల్ రియర్ కెమెరాలతో..
వైర్‌లెస్ చార్జర్, రెండు పవర్ ఫుల్ రియర్ కెమెరాలతో ఈ ఖరీదైన ఫోన్ ప్రధాన ఆకర్షణలు. అయితే కంపెనీ పరిమిత సంఖ్యలో అంటే రూ. 300 యూనిట్లును మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఎంఐ మిక్స్ 2
కాగా షియోమి ఆల్ సెరామిక్ వెర్షన్‌లో ఎంఐ మిక్స్ 2 , వచ్చే వారం ఇండియాలోకి రానున్న వన్ ప్లస్ 5టి స్టార్ వార్స్ ఎడిషన్ కూడా సెరామిక్ బిల్డ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మోడల్స్లోనే ఉన్నాయి.


Click it and Unblock the Notifications








