ఒకరు క్లాస్ హిరో, మరొకరు మాస్ హిరో!!

Posted By: Prashanth

ఒకరు క్లాస్ హిరో, మరొకరు మాస్ హిరో!!

 

స్మార్ట్‌ఫోన్ నిర్మాణ విభాగంలో దూసుకుపోతున్న శామ్‌సంగ్, ఎల్‌జీలు తాజాగా రెండు ఫోన్‌లను వ్ళద్ధి చేశాయి. వాటిలో ఒకటి హై ఎండ్ మొబైల్ కాగా మరొకటి ఎంట్రీ స్థాయి ఫోన్. ఎల్‌జీ రూపొందించిన స్పెక్ట్రమ్ మొబైల్ అత్యాధునిక స్పెసిఫికేషన్‌లను కలిగి 4జీ నెటవర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. శామ్‌సంగ్ రూపొందించిన ఛాంప్ డ్యూయోస్ శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉత్తమమైన ఫీచర్లను ఒదిగి ఉంటుంది.

ఎల్‌జీ స్పెక్ట్రమ్:

* 4.5 అంగుళాల హై డెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280) , 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (రిసల్యూషన్ 3264x2448 పిక్సల్స్) , 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్, ఎల్‌ఈడి ఫ్లాష్, జియో ట్యాగింగ్, 32జీబి ఎక్స్‌టర్నల్ మెమరీ, 4జీ ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, లౌడ్ స్పీకర్, ఆడియో జాక్, 3జీ కనెక్టువిటీ, ఆడ్వాన్సుడ్ వై-ఫై, బ్లూటూత్ v3.0, మైక్రో యూఎస్బీ v2.0, జీపీఎస్ ఫెసిలిటీ, ఆండ్రాయిడ్ v2.3 ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్, సీడీఎమ్ఏ నెట్‌వర్క్ సపోర్ట్, 4జీ LTEసపోర్ట్, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, బ్యాటరీ స్టాండ్ బై 348 గంటలు, బరువు 141.5 గ్రాములు, ధర రూ.10,000.

శామ్‌సంగ్ ఛాంప్ డ్యుయోస్:

* 2.6 అంగుళాల టీఎఫ్టీ రెసిస్టివ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్) , 1.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1280x1024పిక్సల్స్), వీడియో రికార్డింగ్, ఎక్సటర్నల్ మెమెరీ 16జీబి, ఇంటర్నల్ మెమెరీ 50 ఎంబీ, జీపీఆర్ఎస్ సపోర్ట్, బ్లూటూత్ v2.1, యూఎస్బీ v2.0 కనెక్టువిటీ, శామ్ సంగ్ ప్రొప్రైటరీ ప్లాట్ ఫామ్, డ్యూయల్ సిమ్ జీఎస్ఎమ్ సపోర్ట్ ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, బ్యాటరీ స్టాండ్ బై 470 గంటలు, బరువు 88 గ్రాములు. ధర రూ.4,800.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot