ఇది విన్నరా..? ఎల్‌జీ కొత్త ఫ్రెండ్ వస్తున్నాడు..

Posted By: Super

ఇది విన్నరా..? ఎల్‌జీ కొత్త ఫ్రెండ్ వస్తున్నాడు..

సాంకేతిక మార్పుకు అనుగుణంగా తన పంథాను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ‘ఎల్‌జీ’ సంస్థ మొబైల్ మార్కెట్లో తన హవాను కొనసాగిస్తుంది. వినియోగదారులు నాడిని ఎప్పటికప్పుడు పసిగడుతూ నాణ్యమైన ‘ఫ్రెండ్లీ యూజర్’ ఫోన్లను ఎప్పటికప్పడు విడుదలచేస్తుంది. తాజాలా ఎల్‌జీ‘T 515’ డ్యూయల్ సిమ్ మొబైల్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

జీఎస్ఎమ్ వ్యవస్థను సపోర్టు చేసే ఈ మొబైల్లో జీపీఆర్‌ఎస్, వాప్ సర్వీస్‌లను ముందుగానే అప్‌డేట్ చేశారు. 3.2 అంగుళాలు కలిగిన స్ర్కీన్ QVGA టీఎఫ్టీ కలిగి 240 X 320 పిక్సల్ రిసల్యూషన్‌తో కనువిందు చేస్తుంది. ఈ ఫోన్లో పొందుపరిచిన ఎఫ్‌ఎమ్ రేడియో వ్యవస్థ రికార్డబుల్ ఆప్షన్ కలిగి ఉంటుంది. అనుసంధానించిన 2 మెగా పిక్సల్ కెమెరాతో నాణ్యమైన ఫోటోలను తీసుకోవచ్చు. ఫోన్ ఇంటర్నల్ మెమరీ సామర్ధ్యం 4 జీబీగా, ఎక్సప్యాండబుల్ విధానం ద్వార 32 జీబీకి వృద్ధి చేసుకోవచ్చు.

ఇతర ఫీచర్ల విషయానికి వస్తే పొందుపరిచిన మ్యూజిక్ ప్లేయర్ ఎంపీత్రీ, ఏఏసీ, ఏఎమ్మార్, వావ్, ఎమ్ ఐడీ వంటి ఫార్మాట్లను సపోర్టు చేస్తుంది. ఇక వీడియో ప్లేయర్ విషయానికి వస్తే ఏర్పాటు చేసిన మల్టీ ఫార్మాట్ ద్వారా 3జీపీ, ఎంపీ4 వీడియోలను తిలకించవచ్చు. ఈ సెట్లో వై - ఫై వ్యవస్థ లేదు. ఆ లోటును తీరుస్తూ అప్ డేటడ్ ‘కెనుక్టువిటీ డివైజ్ బ్లూటూత్ v2.1, ఈడీఆర్’ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. బ్యాటరీ విషయానికి వస్తే 900 mAh లయోన్ బ్యాటరీ శక్తివంతమైన పవర్‌ను ఫోన్ వ్యవస్థకు అందిస్తుంది. పోర్టబులిటీ విషయానికి వస్తే ‘T 515’ 105 గ్రాముల బరువు మాత్రమే కలిగి ఉంటుంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ పోన్ ధర తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot