ఎల్‌జీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ఐదు వేలకే..!!!

Posted By: Prashanth

ఎల్‌జీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ఐదు వేలకే..!!!

 

ఆధునిక ఫీచర్లతో నిండిన బడ్జెట్ ఫ్రెండ్లీ హ్యాండ్‌సెట్‌ను ఎల్‌జీ ప్రవేశపెట్టింది. ‘ఎల్ జీ T565’ మోడల్‌లో సమంజసమైన ధరకే అందుబాటులోకి రానున్న ఈ డివైజ్ నాజూకైన ప్రొఫైల్‌ను కలిగి కంటికి ఇంపైన కలర్ వేరింయంట్‌లలో డిజైన్ కాబడింది. పూర్తి స్థాయి సోషల్ నెట్‌వర్కింగ్ ఫీచర్లను ఒదిగి ఉన్న ఈ స్మార్ట్ గ్యాడ్జెట్‌ను రూ.5,000 చెల్లించి సొంతం చేసుకోవచ్చు.

‘ఎల్‌జీ T565’ ఫీచర్స్ అదేవిధంగా స్పెసిఫికేషన్స్:

* సింగిల్ కోర్ ఆర్మ్ 11 ప్రాసెసింగ్ వ్యవస్థ, * 3 మెగా పిక్సల్ రేర్ కెమరా, * వీడియో రికార్డింగ్, * డిజిటల్ జూమ్, * 2.8 అంగుళాల పరిమాణం గల మల్టీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, * ప్రాక్సిమిటీ డిటెక్టర్, * ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, * 128 ఎంబీ ర్యామ్, ఇంటర్నల్ మెమరీ 256 ఎంబీ* ఎక్సటర్నల్ మెమెరీ ( మైక్రో‌ఎస్డీ ప్రొవిజన్ ద్వారా మెమరీని 8 జీబి వరకు పెంచుకునే సౌలభ్యత), * వైఫై , * బ్లూటూత్, * జీపీఎస్, * యూఎస్బీ కనెక్టువిటీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot