ఎల్‌జీ 2012!!

By Prashanth
|
LG


భారత్‌లో మొబైల్ హ్యాండ్‌సెట్ల వ్యాపారానికి సంబంధించి ఎల్‌జీ 2012 కార్యచరణను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ ఏడాదిలో మొత్తం 12 ఆండ్రాయిడ్ ఫోన్‌లను విడుదల చేసేందకు బ్రాండ్ సన్నాహాలు చేస్తుంది. వీటిలో దిగువ, మధ్య మరియు అధిక ముగింపు ఫోన్‌లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ సెగ్మంట్ పై ప్రధానంగా ద్ళష్టిసారించిన ఎల్‌జీ ఆప్టిమస్ సిరీస్ నుంచి పలు మోడళ్లలో స్మార్ట్ ఫోన్‌లను ప్రవేశపెట్టనుంది. వాటి పేర్లు...

- ఎల్‌జీ ఆప్టిమస్ 4X HD,

- ఎల్‌జీ ఆప్టిమస్ VU,

- ఎల్‌జీ ఆప్టిమస్ 3D Max,

- ఎల్‌జీ ఆప్టిమస్ L3,

- ఎల్‌జీ ఆప్టిమస్ L5,

- ఎల్‌జీ ఆప్టిమస్ L7,

వీటిలో మొట్టమొదటిగా లాంఛ్ కానున్న ఫోన్ ఎల్‌జీ ఆప్టిమస్ 4X HD, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ వోఎస్ ఆధారితంగా ఈ డివైజ్ పనిచేస్తుంది. ఎన్-విడియా టెగ్రా 3 మొబైల్ ప్రాసెసర్‌ను హ్యాండ్‌సెట్‌లో లోడ్ చేశారు. ర్యామ్ సామర్ధ్యం 1జీబి, 8.1 మెగా పిక్సల్ కెమెరా, 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్.

తరువాత క్రమంలో ఉన్న ఎల్‌జీ ఆప్టిమస్ VU, 5 అంగుళాల మల్టీ టచ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆధారితంగా ఈ డివైజ్ పని చేస్తుంది. వెనుక కెమెరా సామర్ధ్యం 8 మెగా పిక్సల్, ముందు కెమెరా పరిమాణం 1.5 అంగుళాలు, శక్తివంతమైన 1.5జిగాహెడ్జ్ ప్రాసెసర్, వై-ఫై, బ్లూటూత్ 3.0, 32జీబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్.

తరువాతిదైన ఎల్‌జీ ఆప్టిమస్ 3DMax, మునుపటి ఆప్టిమస్ 3డి స్మార్ట్‌‌ఫోన్‌కు అప్‌గ్రేడెడ్ వర్షన్. ఈ స్లిమ్ 3డి హ్యాండ్‌సెట్ 4.3 అంగుళాల ఎల్‌సీడి డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ కెమెరా, 16జీబి ఇన్‌బుల్ట్ మెమరీ.

తరువాత వరసలో ఉన్న ఎల్‌జీ ఆప్టిమస్ L3, L5 మరియు L7లు భిన్న వేరియంట్‌లలో రూపుదిద్దుకున్నాయి. వీటిలో ఎల్3 3.2 అంగుళాల డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంటుంది. కెమెరా పరిమాణం 3 మెగాపిక్సల్, ప్రాసెసర్ సాహర్ధ్యం 800 మెగాహెడ్జ్. ఇక ఎల్5 విషయానికొస్తే స్ర్కీన్ సైజ్ 4 అంగుళాలు. ఈ సిరీస్‌లో చివరిదైన ఎల్7 4.7 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉంటుంది. ఇతర ఫోన్‌ల వివరాలు తెలియాల్సి ఉంది. వీటి ధరలు రూ.7,000 మొదలుకుని రూ.35,000 మధ్య ఉంటాయి. మే నాటికి వీటిలో కొన్ని మార్కెట్లో లభ్యమవుతాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X