ఇక లాభంలేదని అలా చేస్తోంది..?

By Super
|
 LG to launch thinking smartphone


స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో భేష్ అనిపించుకునేందుకు ఎల్‌జీ నిర్విరామంగా శ్రమిస్తోంది. ఆప్టిమస్ 2ఎక్స్ పేరుతో తొలి డ్యూయల్ కోర్ హ్యాండ‌సెట్‌ను ప్రవేశపెట్టిన ఎల్‌జీ అనతికాలంలోనే ఈ ప్రాసెసర్ల సంఖ్యతో పాటు శక్తిని రెట్టింపు చేస్తూ క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేసింది. ఇవేకాకుండా పలు హైఎండ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేసినప్పటికి లీడింగ్ స్థానాన్ని అధిరోహించలేక పోయింది. కారణం మార్కెట్లో శామ్‌సంగ్ ఇస్తున్న పోటీనే.

ఈ క్రమంలో కొత్త పంధాలో దూసుకువెళ్లేందుకు ఎల్‌జీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ధింకింగ్ స్మార్ట్‌ఫోన్ పేరుతో కొత్త తరహా కాన్పెప్ట్‌కు ఈ టాప్‌బ్రాండ్ శ్రీకారం చుట్టింది. ఈ అంశం పై ఎల్‌జీ మొబైల్ కమ్యూనికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ స్పందిస్తూ తాము ప్రవేశపెట్టబోతున్న థింకింగ్ ఫోన్, వినియోగదారుని అవసరాలు తీర్చటంతో పాటు అతని ఎదుగుదలకు తోడ్పడుతుందని వెల్లడించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ముందుగా లోడ్ చేసిన నిర్థిష్ట ప్రణాళికా వ్యవస్థ సదురు వినియోగదారును ఆ విధంగా ప్రేరేపిస్తుంది. ఉదాహరణకు: ఉదయాన్నే నిద్రలేపటం, చేయ్యాల్సిన పనుల గురించి ముందుగా గుర్తుచెయ్యటం తదితర అంశాలు. నోకియా రూపొందించిన లూమియా 900 తరహాలో ఓ హ్యాండ్‌సెట్‌ను డిజైన్ చేసేందుకు ఎల్‌జీ సన్నాహాలు చేస్తుంది.

ఎల్‌జీ ఎలక్ట్రానిక్ పేపర్ డిస్‌ప్లే:

పల్చని పొరతో కూడిన LCDలను రూపొందించటంలో ఎల్‌జీడి (ఎల్‌జీ డిస్‌ప్లే) సంస్థ క్రియాశీలక పాత్రపోషిస్తోంది. తాజాగా ఈ బ్రాండ్ తొలి ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ పేపర్ డిస్‌ప్లే (ఇపీడీ)లను ఇ-బుక్స్ కోసం తయారు చేసింది. ఈ – ఇంక్ ఆధారిత ఎలక్ట్రానిక్ పేపర్ డిస్‌ప్లే పరిమాణం 6 అంగుళాలు. రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్. ఈ సరికొత్త ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే ఈ-బుక్ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తేనుందని విశ్లేషకుల అంచనా.

ఈ ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లేలను రానున్న ఈ-బుక్ రీడర్లలో ఉపయోగించనున్నారు. ఈ డిస్‌ప్లే ఆధారిత గ్యాడ్జెట్‌లు వచ్చే నెల నుంచి యూరప్‌లో లభ్యం కానున్నాయి. ఈ సరికొత్త డిస్‌ప్లే పేపర్‌లో చదివిన అనుభూతిని మీకు కలిగిస్తుంది. ఈ ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే‌ను 40డిగ్రీల వరకు వంచవచ్చు. అంతేకాదండోయ్. ఈ డిస్‌ప్లే కిందపడినా పెద్ద ప్రమాదమేమి ఉండదు. కంటి రుగ్మతలను తగ్గిస్తుంది. తక్కువ విద్యుత్‌ను ఖర్చుచేస్తుంది. ధర కూడా తక్కువే.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X