భవిష్యత్ వ్యూహం పై తర్జన భర్జన!

Posted By: Prashanth

భవిష్యత్ వ్యూహం పై తర్జన భర్జన!

 

కొరియాకు చెందిన అతిపెద్ద కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక సంస్థ ఎల్‌జీ, విండోస్ ఆధారిత ఫోన్‌ల తయారీ విషయంలో వెనకడుగు వేసింది. తాము రూపొందించిన విండోస్ ఆపరేటింగ్ సిస్టం ఫోన్‌లకు ప్రజల నుంచి ఫేలవమైన ఆదరణ లభించటమే ఇందుకు కారణమని ఎల్‌జీ అధికార ప్రతినిధి లీ సీయుంగ్- యోన్ వెల్లడించారు. వస్తున్న ఫలితాలను పరిగణలోకి తీసుకుని తాము విండోస్‌తో సంబంధాలు తెంచుకోబోమని, మైక్రో‌సాఫ్ట్ మొబైల్ ప్లాట్ ఫామ్‌ల పై మరింత పరిశోధన ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి భవిష్యత్‌లో విండోస్ ఆధారిత ఫోన్‌లను విడుదల చేసేందుకు రూపకల్పన చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

విండోస్ ఆధారిత ఫోన్‌లు నిరాశ పరచటంలో ఆండ్రాయిడ్ వోఎస్ హ్యండ్‌సెట్‌ల తయారీ పై ఎల్‌జీ దృష్టి సారించింది. ఇటీవల నిర్వహించిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా వివిధ వేరియంట్‌లలో ఆండ్రాయిడ్ ఫోన్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో ఒకటైన ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్3 త్వరలో విడుదల కానుంది. మరో 12 ఆండ్రాయిడ్ ఫోన్లను త్వరలో విడుదల చేస్తున్నట్లు ఎల్‌జీ వర్గాలు ప్రకటించాయి. కాగా, విండోస్ ఆధారిత హ్యాండ్ సెట్‌లను డిజైన్ చేస్తున్న సంస్థల్లో నోకియా, హెచ్‌టీసీలు ముందంజలో ఉన్నాయి.

ఈ ఏడాదిలో మొత్తం 12 ఆండ్రాయిడ్ ఫోన్‌లను విడుదల చేసేందకు ఎల్‌జీ సన్నాహాలు చేస్తుంది. వీటిలో దిగువ, మధ్య మరియు అధిక ముగింపు ఫోన్‌లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ సెగ్మంట్ పై ప్రధానంగా ద్ళష్టిసారించిన ఎల్‌జీ ఆప్టిమస్ సిరీస్ నుంచి పలు మోడళ్లలో స్మార్ట్ ఫోన్‌లను ప్రవేశపెట్టనుంది. వాటి పేర్లు…

- ఎల్‌జీ ఆప్టిమస్ 4X HD,

- ఎల్‌జీ ఆప్టిమస్ VU,

- ఎల్‌జీ ఆప్టిమస్ 3D Max,

- ఎల్‌జీ ఆప్టిమస్ L3,

- ఎల్‌జీ ఆప్టిమస్ L5,

- ఎల్‌జీ ఆప్టిమస్ L7.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting