‘ఎల్‌జీ’ ఆ గుట్టు విప్పుతుందా..?

Posted By: Prashanth

‘ఎల్‌జీ’ ఆ గుట్టు విప్పుతుందా..?

 

ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో’లో గ్యాడ్జెట్ తయారీ సంస్థలు తమ తమ కొత్త ఉత్పత్తులను ప్రదర్శించటం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి గాను లాస్‌వేగాస్‌లో నిర్విహించనున్న ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో’కు ఏర్పాట్లు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ బ్రాండ్‌లలో ఒకటైన ‘ఎల్‌జీ’ తమ కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ నమూనాను ఈ వేదిక పై ప్రదర్శించనుందని విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఎల్‌జీ ప్రదర్శించబోతున్న ఈ మొబైల్ ప్రత్యేకతను పరిశీలిస్తే, నిక్షిప్తం చేసిన శక్తివంతమైన ‘ఇంటెల్ మిడ్‌ఫీల్డ్ మొబైల్ ప్రాసెసర్’ వేగవంతమైన పనితీరునందించే ప్రాసెసర్‌లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ప్రాసెసింగ్ వ్యవస్థను ఆండ్రాయిడ్ వోఎస్‌కు ఇంటిగ్రేట్ చేయటమన్నది సాధారణ విషయం కాదు. భారీ ఖర్చుతో కూడుకున్న ఈ ‘ప్రాజెక్ట్’ వ్యవహారంలో ఏ మాత్రం వెనకాడుకుండా ఎల్‌జీ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎల్‌జీ వినియోగిస్తున్న ఈ ప్రాసెసర్‌ల పై ఇంటెల్ సబ్సిడీ ఇస్తుందన్న వార్తలు ఊపందుకున్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమచారాన్ని జనవరి 9న జరిగే ఆ వేడుకలో ఎల్‌జీ వెల్లడిస్తుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot