LG V30 plus ధర తగ్గింది, బెస్ట్ ఫీచర్లు ఇవే !
దక్షిణకొరియా దిగ్గజం LG గతేడాది ఇండియా మార్కెట్లోకి ఎల్‌జీ వీ30 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
దక్షిణకొరియా దిగ్గజం LG గతేడాది ఇండియా మార్కెట్లోకి ఎల్‌జీ వీ30 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. లాంచింగ్ సమయంలో దీని ధరను కంపెనీ రూ.58,000గా నిర్ణయించగా అప్పటి నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గుతూ వస్తోంది. కాగా ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.44,990గా ఉంటే మళ్లీ తగ్గింపును అందుకుంది. కంపెనీ రూ. 3 వేలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రూ. 3 వేల తగ్గింపు అనంతరం రూ.41,990కు ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్‌లో అందుబాటులో ఉంది.

ఎల్‌జీ వీ30 ప్లస్ ఫీచర్లు
6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.

అమెజాన్ కూడా ఈ ఫోన్ కొనుగోలుపై ..
ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ కూడా ఈ ఫోన్ కొనుగోలుపై కస్టమర్లకు మరికొన్ని ఆఫర్లను ప్రకటించింది. రూ.8500 ఎక్స్చేంజ్ ఆఫర్‌ను, నెలకు రూ.1,996 ఈఎంఐను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. వీటితో పాటు ఈఎంఐ లావాదేవీలపై అదనంగా 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది.

6 ఇంచ్ భారీ బెజెల్ డిస్‌ప్లే
ఇందులో 6 ఇంచ్ భారీ బెజెల్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 16, 13 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న రెండు పవర్‌ఫుల్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటితో క్వాలిటీ ఉన్న ఫొటోలు, వీడియోలను తీసుకోవచ్చు. ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను ఇందులో ఏర్పాటు చేశారు.

ఎల్‌జీ వీ30
కాగా వి సీరిస్ లో మరికొన్ని ఫోన్లను కంపెనీ లాంచ్ చేసింది.
ఎల్‌జీ వీ30
64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల ధరలు వరుసగా రూ.53,880, రూ.56,690.
ఎల్‌జీ వీ30 ఫీచర్లు
6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 16, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెంట్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.

వీ30ఎస్ థిన్‌క్యూ
128/256 జీబీ స్టోరేజ్ ధరలు వరుసగా రూ.63వేలు, రూ.66వేలు
ఎల్‌జీ వీ30ఎస్ థిన్‌క్యూ ఫీచర్లు
6 ఇంచ్ క్యూహెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 16, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5 ఎల్ఈ, ఎన్ఎఫ్సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.


Click it and Unblock the Notifications








