Home
Mobile

పుల్ విజన్ డిస్‌ప్లే‌తో LG V30 Plus, ధర కాస్త ఎక్కువే !

ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఎల్‌జీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'వీ30 ప్లస్‌'ను ఇండియాలో లాంచ్ చేసింది.

By Hazarath

ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఎల్‌జీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'వీ30 ప్లస్‌'ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి అమెజాన్ సైట్‌లో ప్రత్యేకంగా లభ్యం కానున్న ఈ ఫోన్ ధరను కంపెనీ రూ.44,990గా నిర్ణయించింది. కాగా ఈ ఫోన్ పుల్ విజన్ డిస్‌ప్లే‌తో వినియోగదారులను అలరిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఎల్‌జీ వీ30 ప్లస్ ఫీచర్లు

ఎల్‌జీ వీ30 ప్లస్ ఫీచర్లు

6 ఇంచ్ క్యూహెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో), హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌ఎసీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.

మొదటి 2వేల కస్టమర్లకు..

మొదటి 2వేల కస్టమర్లకు..

ఈ ఫోన్‌ను కొన్న మొదటి 2వేల కస్టమర్లకు వైర్‌లెస్ చార్జర్‌ను ఉచితంగా అందివ్వనున్నారు. ఇక ఫోన్‌కు 6 నెలల వాలిడిటీ ఉన్న వన్ టైం స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్‌ను కూడా అందిస్తున్నారు. 

6 ఇంచుల భారీ ఫుల్ విజన్ బెజెల్ లెస్ డిస్‌ప్లే

6 ఇంచుల భారీ ఫుల్ విజన్ బెజెల్ లెస్ డిస్‌ప్లే

18:9 యాస్పెక్ట్ రేషియో ఉన్న 6 ఇంచుల భారీ ఫుల్ విజన్ బెజెల్ లెస్ డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 835 పవర్‌ఫుల్ ప్రాసెసర్‌, భారీ స్టోరేజ్‌, ఎఫ్‌ 1.6 భారీ ఎపర్చర్, క్లిస్టర్‌ క్లియర్‌ గ్లాస్‌‌, హై ఫై వీడియో రికార్డింగ్‌ తమ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకతలుగా ఎల్‌జీ పేర్కొంది.

రెండు పవర్‌ఫుల్ కెమెరాలను/.

రెండు పవర్‌ఫుల్ కెమెరాలను/.

ఫోన్ వెనుక భాగంలో 16, 13 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న రెండు పవర్‌ఫుల్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి సహాయంతో క్వాలిటీ ఉన్న ఫొటోలు, వీడియోలను తీసుకోవచ్చు. 3300 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.

Best Mobiles in India

English summary
LG V30+ With Dual Rear Cameras, FullVision Display Launched in India: Price, Specifications More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X