ఎల్‌జీ నుంచి మరో సంచలన స్మార్ట్‌ఫోన్ V30S ThinQ
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కంపెనీ ఎల్‌జీ (LG), ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కంపెనీ ఎల్‌జీ (LG), ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది.మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2018 ప్రారంభానికి ఒక రోజు ముందు ఎల్‌జీ తన వీ30ఎస్ థింక్ (V30S ThinQ) స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. గతేడాది విడుదలైన LG V30 స్మార్ట్‌ఫోన్‌కు ఈ మోడల్ అప్‌డేటెడ్ వర్షన్ అని సంస్థ వెల్లడించింది. సామ్‌సంగ్ నుంచి త్వరలో లాంచ్ కాబోతోన్న గెలాక్సీ ఎస్9, గెలాక్సీ ఎస్9+ ఫోన్‌లకు V30S ThinQ ప్రధాన పోటీదారుగా నిలిచే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

శక్తివంతమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ..
LG V30S ThinQ స్మార్ట్‌ఫోన్‌కు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్రధాన హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఈ సాంకేతికత ఫోన్‌లోని కెమెరా అలానే వాయిస్ రికగ్నిషన్ విభాగాలను మరింత పటిష్టం చేసినట్లు సంస్థ చెబుతోంది. ఈ డివైస్‌లో నిక్షిప్తం చేసిన Vision AI అనే టెక్నాలజీ AI CAM, QLens, Bright Mode వంటి మూడు సరికొత్త కెమెరా ఫీచర్లను యూజర్‌కు అదనంగా అందిస్తుంది.

AI CAMతో హై-క్వాలిటీ ఫోటోగ్రఫీ
వీటిలో AI CAM అనే ఫీచర్ ఫ్రేమ్‌లోని సబ్జెక్ట్స్‌ను విశ్లేషించి అందుకు అవసరమైన ఆప్టిమల్ షూటింగ్
మోడ్‌ను రికమెండ్ చేయటం జరుగుతుంది. మరో ఫీచర్ QLens ద్వారా యూజర్లు మరింత సౌకర్యవంతంగా QR కోడ్‌లను స్కాన్ చేసుకునే వీలుంటుందట.. ముఖ్యంగా ఆన్‌లైన్ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచటంతో పాటు ల్యాండ్‌మార్క్స్‌కు సంబంధించిన వివరాలను అందించటంలో ఈ ఫీచర్ తోడ్పడుతుంది. మరో ఫీచర్ Bright Mode ద్వారా లో లైట్ ఫోటోగ్రఫీని మెరుగుపరుచుకునే వీలుంటుంది.

వాయిస్ కమాండ్స్ ద్వారా యాప్ సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు..
V30S ThinQ లో నిక్షిప్తం చేసిన Voice AI ఫీచర్ ద్వారా యాప్స్‌ను వాయిస్ కమాండ్స్ ఆధారంగా రన్ చేసుకునే వీలుంటుంది. గూగుల్ వాయిస్ అసిస్టెంట్ టెక్నాలజీ ఆధారంగా స్పందించగలిగే ఈ ప్రొప్రైటరీ సాఫ్ట్‌వేర్ పలు ఎక్స్‌క్లూజివ్ వాయిస్ కమాండ్ ఫీచర్లను కలిగి ఉంది.

V30S ThinQ స్పెసిఫికేషన్స్...
6 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ప్లస్ ఓఎల్ఈడి ఫుల్ విజన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 1440x 2880 పిక్సల్స్) విత్ 16:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్, 6జీబి ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్స్ (128జీబి + 256జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2టీబీ వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ సపోర్ట్, బ్లుటూత్ 5.0 (బీఎల్ఈ), నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3300ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0 టెక్నాలజీ, ఫోన్ చుట్టుకొలత 151.7x75.4x7.3 మిల్లీ మీటర్లు, బరువు 158 గ్రాములు.


Click it and Unblock the Notifications








