ఇండియాలో లాంచ్ అయిన LG V40 ThinQ ధర ఎంతో తెలుసా...?

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ ఎల్‌జీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. వి సిరీస్‌లో తరువాతి తరం ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను LG V40 ThinQ పేరుతోవిడుదల చేసింది.

|

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ ఎల్‌జీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. వి సిరీస్‌లో తరువాతి తరం ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను LG V40 ThinQ పేరుతోవిడుదల చేసింది. వెనుక వైపు మూడు, ముందు వైపు రెండు మొత్తం ఐదు కెమెరా లెన్సస్‌తో లాంచ్‌ చేసింది. నాలుగు రంగుల ఆప్షన్స్‌లో ఇది అందుబాటులోకి వచ్చింది. శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 9, ఐ ఫోన్‌ ఎక్స్‌ఎస్‌మాక్స్‌కి గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్‌ వర్గాల అంచనా. ఈ నెల 20వ తేదీ నుంచి అమెజాన్ లో ఈ ఫోన్ రూ.49,990 ధరకు లభ్యం కానుంది.

మార్కెట్లో ఇప్పుడు ఉన్న బెస్ట్ 4జీ ప్లాన్స్ ఇవే...మీకు సూట్ అయ్యే ప్లాన్ ఏధో చెక్ చేసుకోండిమార్కెట్లో ఇప్పుడు ఉన్న బెస్ట్ 4జీ ప్లాన్స్ ఇవే...మీకు సూట్ అయ్యే ప్లాన్ ఏధో చెక్ చేసుకోండి

ఫీచర్లు

ఫీచర్లు

6.4 ఇంచ్ ఓలెడ్ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 9.0 పై), 16, 12, 12 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 8, 5 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0, వైర్‌లెస్ చార్జింగ్.

6.4 ఇంచుల భారీ డిస్‌ప్లే

6.4 ఇంచుల భారీ డిస్‌ప్లే

LG V40 ThinQ స్మార్ట్‌ఫోన్‌లో 6.4 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇందులో వెనుక భాగంలో 12 ఎంపీ స్టాండర్డ్‌ కెమెరా, 16 ఎంపీ సూపర్‌వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 12ఎంపీ పోర్ట్రయిట్‌ కెమెరాను రియర్‌ సైడ్‌ అమర్చింది.

5, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలను

5, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలను

వీటితో 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ వస్తుంది. అలాగే ముందు భాగంలో 5, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

ఫింగర్ ప్రింట్ సెన్సార్

ఫింగర్ ప్రింట్ సెన్సార్

ఈ ఫోన్‌లో ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను అందిస్తున్నారు. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. వైర్‌లెస్ చార్జింగ్‌కు ఇందులో సపోర్ట్‌ను అందిస్తున్నారు.

కెమెరా ప్రత్యక ఆకర్షణ....

కెమెరా ప్రత్యక ఆకర్షణ....

ప్రైమరీ కెమెరా ఎల్‌జీ ట్రేడ్‌మార్క్‌ ఫీచర్‌ మెయిన్‌ లెన్స్‌తో వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ను కలిగి ఉంది. పోర్ట్రెయిట్ మోడ్‌కు ఇటీవల డిమాండ్‌ బాగా పెరుగుతుండటంతో, ఎల్‌జీ మూడో లెన్స్‌ను ఈ విధంగా రూపొందించింది.

Best Mobiles in India

English summary
LG V40 ThinQ announced in India with five cameras, priced at Rs 49,990.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X