జనవరి 20నుంచి ఎల్‌జీ 5 కెమెరాల ఫోన్ సేల్ షురూ...!

కొరియా ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ దిగ్గజమైన ఎల్‌జీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియా మార్కెట్లో లాంచ్ చేయబోతుంది.

|

కొరియా ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ దిగ్గజమైన ఎల్‌జీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియా మార్కెట్లో లాంచ్ చేయబోతుంది. వి సిరీస్‌లో నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఎల్‌జీ వీ40 థిన్‌క్యూ పేరుతో విడుదల చేయబోతుంది. వెనుక వైపు మూడు, ముందు వైపు రెండు మొత్తం ఐదు కెమెరా లెన్సస్‌తో లాంచ్‌ చేయనుంది. నాలుగు రంగుల ఆప్షన్స్‌లో ఇది అందుబాటులో ఉంటుంది. శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 9, ఐ ఫోన్‌ ఎక్స్‌ఎస్‌మాక్స్‌కి గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్‌ వర్గాల అంచనా. ఈ నెల 20వ తేదీ నుంచి అమెజాన్ లో ఈ ఫోన్ రూ.72,490 ధరకు లభ్యం కానుంది.

పేటీఎం మాల్ లో వివో ఫోన్ల పై దుమ్మరేపే డిస్కౌంట్లుపేటీఎం మాల్ లో వివో ఫోన్ల పై దుమ్మరేపే డిస్కౌంట్లు

కెమెరా ప్రత్యక ఆకర్షణ....

కెమెరా ప్రత్యక ఆకర్షణ....

ప్రైమరీ కెమెరా ఎల్‌జీ ట్రేడ్‌మార్క్‌ ఫీచర్‌ మెయిన్‌ లెన్స్‌తో వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ను కలిగి ఉంది. పోర్ట్రెయిట్ మోడ్‌కు ఇటీవల డిమాండ్‌ బాగా పెరుగుతుండటంతో, ఎల్‌జీ మూడో లెన్స్‌ను ఈ విధంగా రూపొందించింది.

6.4 ఇంచుల భారీ డిస్‌ప్లే

6.4 ఇంచుల భారీ డిస్‌ప్లే

ఎల్‌జీ వీ40 థిన్‌క్యూ స్మార్ట్‌ఫోన్‌లో 6.4 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇందులో వెనుక భాగంలో 12 ఎంపీ స్టాండర్డ్‌ కెమెరా, 16 ఎంపీ సూపర్‌వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 12ఎంపీ పోర్ట్రయిట్‌ కెమెరాను రియర్‌ సైడ్‌ అమర్చింది.

5, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలను

5, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలను

వీటితో 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ వస్తుంది. అలాగే ముందు భాగంలో 5, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

ఫింగర్ ప్రింట్ సెన్సార్

ఫింగర్ ప్రింట్ సెన్సార్

ఈ ఫోన్‌లో ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను అందిస్తున్నారు. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. వైర్‌లెస్ చార్జింగ్‌కు ఇందులో సపోర్ట్‌ను అందిస్తున్నారు.

ఎల్‌జీ వీ40 థిన్‌క్యూ ఫీచర్లు

ఎల్‌జీ వీ40 థిన్‌క్యూ ఫీచర్లు

6.4 ఇంచ్ ఓలెడ్ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 9.0 పై), 16, 12, 12 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 8, 5 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0, వైర్‌లెస్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
LG V40 ThinQ India launch confirmed, five-camera phone to go on sale on Amazon on January 20.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X