మార్కెట్లోకి ఎల్‌జి విండోస్ 7 స్మార్ట్ ఫోన్ E906

Posted By: Super

మార్కెట్లోకి ఎల్‌జి విండోస్ 7 స్మార్ట్ ఫోన్ E906

ప్రస్తుతం ప్రపంచ మొబైల్ మార్కెట్లో మూడే మూడు ప్లాట్ ఫామ్స్ మద్య భీభత్సమైన యుద్దం జరుగుతుంది. ఆ మూడు ప్లాట్ ఫామ్స్ ఏమిటంటే ఆండ్రాయిడ్, సింబియన్, విండోస్ 7. ఈ మూడు ఫ్లాట్ ఫామ్స్‌లలో కంపెనీలు వారియొక్క కొత్త మోడల్స్‌ని విడుదల చేసి వారియొక్క గుత్తాధిపత్యాన్ని చాటుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఏదైనా కంపెనీ ఒక ఫ్లాట్ ఫామ్ మీద మొబైల్‌ని విడుదల చేస్తే ఆ తర్వాత మిగినిన కంపెనీలు కూడా పోటీ పడి మరి ఆ ప్లాట్ ఫామ్ మీద మొబైల్స్‌ని విడదల చేస్తున్న రోజులివి.

ఎలక్ట్రానిక్స్ రంగంలో అధ్బుతమైన ఫెర్పెమెన్స్‌ని కొనసాగిస్తున్నటువంటి ఎల్‌జి కంపెనీ మొబైల్ రంగంలో తన హావాని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాగంగా త్వరలో ఎల్‌జి కంపెనీ నుండి ఓ సరిక్రొత్త విండోస్ 7 స్మార్ట్ ఫోన్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఎల్‌జి త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నటువంటి ఈ విండోస్ స్మార్ట్ ఫోన్ రన్ అయ్యేటటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ మ్యాంగో ఆపరేటింగ్ సిస్టమ్. ఏ సమయంలోనైనా సరే ఎల్‌జి నుండి ఈ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ పోన్‌ని మనం ఊహించవచ్చు.

ప్రముఖ టెక్నాలజీ బ్లాగు ప్రకారం ఎల్‌జి విడుదల చేయనున్నటువంటి ఈ స్మార్ట్ పోన్ పేరు LG E906. LG optimus 7 తర్వాత ఎల్‌జి ఈ స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి. కంపెనీ ప్రతినిధి వెల్లడించిన సమాచారం ప్రకారం ఎల్‌జి ప్రస్తుతం ఆప్టిమస్ మోడల్స్ మీద తన దృష్టిని కేంద్రీకరిచండం జరిగింది. విండోస్ 7 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించి పూర్తి అప్ డేట్స్ తెలిసిన తర్వాత LG E906 త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని అన్నారు.

ఎవరైనా LG E906 గురించి తెలుసు కొవాలంటే దీని గురించిన సమాచారం కొంత కంపెనీ వెబ్‌సైట్‌లో ఉంచడం జరిగిందని అన్నారు. అందులో ఉంచిన సమాచారం మేరకు LG E906 స్క్రీన్ సైజు దాదాపు 480* 800 ఫిక్సల్‌ గా ఉంటుంది. ఇందులో ఇంటర్నెట్‌ని ఉపయోగించడం కోసం ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 9 బ్రౌజర్‌ని ఫీచర్‌గా ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకొక విషయం ఏమిటంటే LG E906 వై-పై సర్టిఫికేషన్‌ని కూడా పొందడం జరిగింది. దీనివల్ల ఈ స్మార్ట్ ఫోన్ IEEE స్టాండర్ట్స్‌ని పొందడమే కాకుండా మొబైల్ పై వై-పై లోగో కూడా ఉంటుంది.

ప్రస్తుతం మార్కెట్లోకి విండోస్ మొబైల్స్‌ని ప్రవేశపెట్టడానికి చాలా కంపెనీలు వాటి యొక్క డబ్బుని, టైమ్‌ని పణంగా పెట్టడం జరుగుతుంది. మరికొన్ని కంపెనీలు ఐతే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న విండోస్ ఫోన్స్‌కి అప్‌డేట్ వర్సన్స్‌ని ప్రవేశపెడుతున్నాయి. మార్కెట్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ హాల్ చల్ చేస్తున్న తరుణంలో విండోస్ మొబైల్స్ కూడా లెటేస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినటువంటి విండోస్ మ్యంగో ఆపరేటింగ్ సిస్టమ్ మీద కొత్త మొబైల్స్‌ని మార్కెట్లోకి తీసుకురావలనే యోచనలో ఉన్నయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot