ఆర్డినరీ ఫోన్ అయినా అదిరిపోయే లుక్..?

Posted By: Prashanth

ఆర్డినరీ ఫోన్ అయినా అదిరిపోయే లుక్..?

 

ఉత్పత్తుల ఎంపికలో నవీకరణకు ప్రాధాన్యతనిచ్చే ఎల్‌జీ(LG) 2011 ముగింపుగా ‘LG X350’ వేరియంట్‌లో ఓ సాధారణ మొబైల్‌ను విడుదల చేసింది. ఈ గ్యాడ్జెట్ ఆర్డినరీ హోదాను పొందినప్పటికి అదిరిపోయే లుక్‌తో ఇట్టే ఆకట్టకుంటుంది. రోజు వందల కొద్ది టెక్స్ట్ సందేశాలను పంపే వారికి ఈ హ్యాండ్‌సెట్ పూర్తి‌స్థాయి సౌకర్యకవంతంగా ఉంటుంది. మన్నికైన ఫీచర్లతో తక్కువ ధరకే లభ్యం కానున్న ‘X350’ ముఖ్య విశేషాలు...

* డ్యూయల్ సిమ్, జీఎస్ఎమ్ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది, * టైపింగ్‌కు అనువుగా క్వర్టీ కీప్యాడ్, * ఫోన్ ఇంటర్నల్ మెమరీ 43 ఎంబీ, * విస్తరణ మెమరీ 8జీబి, * ఇంటర్నెట్ కనెక్టువిటీని సపోర్ట్ చేసే విధంగా జీపీఆర్ఎస్, ఎడ్జ్ వ్యవస్థలు, * బ్లూటూత్ కనెక్టువిటీ, * 2 మెగా పిక్సల్ కెమెరా, * వీడియో రికార్డింగ్ సామర్ద్యం, * WAP 2.0, xHTML బ్రౌజర్, * ఎఫ్ఎమ్ రేడియో, * ఆడియో, వీడియో ప్లేయర్, * బ్యాటరీ స్టాండ్ బై 555 గంటలు, టాక్‌టైమ్ 5 గంటల 30 నిమిషాలు.

2 మెగా పిక్సల్ క్వాలిటీ రిసల్యూషన్ కెమెరా మన్నికైన ఫోటోలు తీసుకునేందుకు దోహదపడుతుంది. డివైజ్‌లో వై-ఫై, 3జీ కనెక్టువిటీ లోపించినప్పటికి ఆ వెలితిని జీపీఆర్ఎస్, ఎడ్జ్ వ్యవస్ధలు తీరుస్తాయి. ఇండియన్ మార్కెట్లో ‘LG X350’ ధర, విడుదలకు సంబంధించి అధికారికంగా వివరాలు వెలువడాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot