యూత్ ఇక ఫ్లాట్..!!

Posted By: Super

యూత్ ఇక ఫ్లాట్..!!

 

యువతను ఆకట్టుకునే ప్రయత్నంగా ఎల్‌జీ మరోసారి ముందుకొచ్చింది. సందేశాలను వేగవంతంగా పంపుకునేందుకుగాను, ఉత్తమ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్‌లతో కూడిన లో బడ్జెట్ మొబైల్ హ్యాండ్‌సెట్‌ను ఎల్‌జీ వృద్ధి చేసింది. పేరు ఎక్స్‌ప్రెషన్ సీ395, ఈ స్లైడింగ్ మోడల్  ఫోన్‌లో నిక్షిప్తం చేసిన వివధ ఫీచర్లు యువతను మైమరుపుకు లోనుచేస్తాయి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

-    స్లయిడ్-అవుట్ సామర్థ్యం కలిగిన QWERTY కీబోర్డ్,

- 3 అంగుళాల WQVGA టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

-    రిసల్యూషన్ 400 x 200పిక్సల్స్,

-    2మెగా పిక్సల్ కెమెరా,

-    వీడియో రీకార్డింగ్ సౌలభ్యత,

-    బ్లూటూత్ 2.1,

-    వన్ టచ్ స్పీకర్ ఫోన్ ఫెసిలిటీ,

-    50ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్,

-    మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,

-    ఎల్‌జీ ఇన్స్‌స్టెంట్ నోట్,

-    మల్టీపుల్ లాంగ్వేజ్ సామర్ధ్యం,

- AT&T సోషల్ నెట్,

-    మన్నికైన బ్యాకప్ నిచ్చే 1000mAh బ్యాటరీ

ఫోన్‌‌లో ఏర్పాటు చేసిన ఎల్‌జీ ఇన్స్‌స్టెంట్ నోట్ ఫీచర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ వ్యవస్థ సౌలభ్యతతో యూజర్ త్వరితగతిన నోట్స్‌తో పాటు టెక్స్ట్ సందేశాలను కంపోజ్ చేసుకోవచ్చు. యూజర్ తన కమ్యూనికేషన్ స్థాయిని పెంచుకునే విధంగా టెక్స్ట్ సందేశాలకు అదనంగా వాయిస్ మెసేజ్‌లతో పాటు వీడియో క్లిప్పింగ్‌లను జత చేసుకోవచ్చు. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి సులువుగా లాగిన్ అయ్యే సౌలభ్యత ఉంటుంది. నిక్సిప్తం చేసిన బ్లూటూత్ వ్యవస్థ వేగవంతమైన డేటా షేరింగ్‌కు తోడ్పడుతుంది. ముఖ్యంగా యువతకు సంబంధించిన కమ్యూనికేషన్ అవసరాలను తీర్చటంలో ఎక్స్‌ప్రెషన్ సీ395 క్రీయాశీలకంగా వ్యవహరిస్తుంది. ఈ తక్కువ బడ్జెట్ ఫోన్ ధర ఇతర ఫీచర్లకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot