Home
Mobile

ఐఫోన్ Xని సవాల్ చేస్తున్న ఎల్‌జి హైఎండ్ స్మార్ట్‌ఫోన్‌

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ తయారీదారీ దిగ్గజం ఎల్‌జీ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ 'సిగ్నేచర్‌ ఎడిషన్‌ 2018' ను ఈ రోజు విడుదల చేసింది.

By Hazarath Aiah

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ తయారీదారీ దిగ్గజం ఎల్‌జీ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ 'సిగ్నేచర్‌ ఎడిషన్‌ 2018' ను ఈ రోజు విడుదల చేసింది. కాగా బ్లాక్‌, వైట్‌ కలర్‌ వేరియెంట్లలో ఈ ఫోన్‌ విడుదలైంది. హై ఎండ్ స్మార్ట్‌ఫోన్లలో ఐఫోన్‌ ఎక్స్‌కి ఈ ఫోన్ సవాల్ విసరనుంది. లక్ష రూపాయలకు పైగా ధరతో భారత్‌లో అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా ఎల్‌జీ సిగ్నేచర్‌ ఎడిషన్‌ 2018 వినియోగదారుల ముందుకు వచ్చింది. గతేడాది లాంచ్‌ చేసిన ఎల్‌జీ సిగ్నేచర్‌ ఎడిషన్‌కు సక్సెసర్‌గా, ఎల్‌జీ సిగ్నేచర్‌ ఎడిషన్‌(2018)ను ఎల్‌జీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

ఎల్‌జీ సిగ్నేచర్‌ ఎడిషన్‌ 2018 ఫీచర్లు

ఎల్‌జీ సిగ్నేచర్‌ ఎడిషన్‌ 2018 ఫీచర్లు

6 ఇంచ్‌ క్వాడ్‌ హెచ్‌డీ ప్లస్‌ ఓలెడ్‌ డిస్‌ప్లే, 2880 x 1440 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌, గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌, ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 ప్రాసెసర్‌, 6 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌, 2 టీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో, 16 మెగాపిక్సల్‌ డ్యుయల్‌ బ్యాక్‌ కెమెరాలు, 8 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, ఐపీ 68 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌, 3డీ సరౌండ్‌ సౌండ్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్‌ బ్యాండ్‌ వైఫై, బ్లూటూత్‌ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌ సి, 3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ, క్వాల్‌కామ్‌ క్విక్‌ చార్జ్‌ 3.0, వైర్‌ లెస్‌ చార్జింగ్‌.

ధర 1,22,820 రూపాయలు

ధర 1,22,820 రూపాయలు

తెలుపు, నలుపు రంగుల్లో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర 1,999,800 ఓన్‌లు అంటే దేశీయ కరెన్సీ ప్రకారం 1,22,820 రూపాయలు. ఐఫోన్‌ ఎక్స్‌ ధర రూ.1,02,425. ఐఫోన్‌ ఎక్స్‌ కంటే కూడా ఎల్‌జీ సిగ్నేచర్‌ ఎడిషన్‌(2018) స్మార్ట్‌ఫోనే ఖరీదైనది.

ప్రీ-ఆర్డర్లు నేటి నుంచే..

ప్రీ-ఆర్డర్లు నేటి నుంచే..

ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రీ-ఆర్డర్లు నేటి నుంచే ప్రారంభమవుతున్నాయి. ఎల్‌జీ సిగ్నేచర్‌ ఎడిషన్‌ 2018, జిర్కోనియం పింగాణీ వంటి ప్రీమియం మెటిరీయల్‌తో రూపొందింది. ఇది వెనుకవైపు ఎలాంటి గీతలు పడకుండా కాపాడుతోంది.

ఆగస్టు 13వ తేదీ నుంచి..

ఆగస్టు 13వ తేదీ నుంచి..

ఆగస్టు 13వ తేదీ నుంచి రూ.1.22 లక్షలకు ఈ ఫోన్‌ వినియోగదారులకు లభ్యం కానుంది. ఇంకొక అధ్భుతమైన ఫీచర్ ఏంటేంటే కస్టమర్లు ఫోన్‌ వెనుక భాగంలో తమ పేరును అమర్చుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
South Korean tech giant LG has unveiled the company’s latest premium smartphone in the LG Signature series.More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X