Just In
- 6 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 8 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 11 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 14 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Movies
సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
64Mp క్వాలిటీతో 9 కెమెరాల స్మార్ట్‌ఫోన్, దిగ్గజాలకు దిమ్మతిరిగినట్టే !
స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో మరో విప్లవం చోటు చేసుకోబోతోంది. కెమెరా ఫోన్లకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడిన నేపథ్యంలో అన్ని మొబైల్ దిగ్గజాలు ఇప్పుడు కెమెరా ఫోన్ల వైపు తమ దృష్టిని సారించాయి. ఈ నేపథ్యంలోనే హువాయి, హెచ్‌టీసీ లాంటి కంపెనీలు నాలుగు కెమెరాలతో తమ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి వదలాయి. అది ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే వీరి బాటలో ఇప్పుడు మరో కంపెనీ కూడా దూసుకొస్తోంది. అమెరికాకు చెందిన డిజిటల్ ఫోటోగ్రఫీ కంపెనీ లైట్ 9 కెమెరాలతో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురానుందని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పరిశోధనలు కూడా మొదలయ్యాయి.

లైట్ నుంచి 9 కెమెరాలు కలిగిన ఫోన్
కాంట్రాక్ట్ తయారీదారు Foxconnలో పెట్టుబడిదారుగా ఉన్న అమెరికా కంపెనీ లైట్ త్వరలో 9 కెమెరాలు కలిగిన ఓ ఫోన్‌ను విడుదల చేయనుంది. దీనిపై ఇప్పటికే ఆ కంపెనీ పరీక్షలు చేస్తున్నది. త్వరలోనే ఈ ఫోన్‌ను అందుబాటులోకి తేనున్నారు.

ఎల్16 పేరిట పాకెట్ సైజ్ కెమెరా
నిజానికి లైట్ కంపెనీ గతంలో ఎల్16 పేరిట ఓ పాకెట్ సైజ్ కెమెరాను విడుదల చేసింది. అందులో ఏకంగా 16 కెమెరాలను ఏర్పాటు చేశారు.

స్మార్ట్‌ఫోన్‌లో ఏకంగా 9 కెమెరాలను..
ఈ నేపథ్యంలోనే సదరు కెమెరా నుంచి ప్రేరణ పొంది లైట్ కంపెనీ తాను కొత్తగా విడుదల చేయనున్న స్మార్ట్‌ఫోన్‌లో ఏకంగా 9 కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది.

64 మెగాపిక్సల్ క్వాలిటీ
లైట్ కంపెనీ విడుదల చేయనున్న స్మార్ట్‌ఫోన్‌లో ఉండే 9 కెమెరాలతో తీసుకునే ఫొటోలు 64 మెగాపిక్సల్ క్వాలిటీని కలిగి ఉంటాయి. దీంతోపాటు అత్యంత తక్కువ కాంతిలో ఫొటోలు తీసినా చాలా బాగా వచ్చేలా ఆ కెమెరాలను తీర్చిదిద్దనున్నారు.

ఫోన్‌పై ప్రస్తుతం పరీక్షలు..
అయితే లైట్ కంపెనీ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందో వివరాలను వెల్లడించలేదు. కానీ ఆ ఫోన్‌పై ప్రస్తుతం పరీక్షలు జరుపుతున్నందున అతి త్వరలోనే ఆ ఫోన్‌ను మనం మార్కెట్‌లో చూసే అవకాశం ఉంది.

హువావే పీ20 ప్రొ, హెచ్‌టీసీ యూ12 ప్లస్..
ఇక ఇప్పటికే హువావే పీ20 ప్రొ, హెచ్‌టీసీ యూ12 ప్లస్ ఫోన్లలో నాలుగు కెమెరాల సెటప్‌ను ఏర్పాటు చేశారు. అదే లైట్ కంపెనీ స్మార్ట్‌ఫోన్ వస్తే ఇక వెనుక భాగంలో అధిక కెమెరాలు కలిగిన ఫోన్లకు మంచి డిమాండ్ వస్తుందని చెప్పవచ్చు.

Washington Post అనే పత్రిక..
ఈ విషయాన్ని అమెరికాకు చెందిన Washington Post అనే పత్రిక పోస్ట్ చేసింది. 64MP primary camera ద్వారా స్టన్నింగ్ ఫోటోలను తీసుకోవచ్చని బ్యాక్ గ్రౌండ్లో bokeh shots ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని కంపెనీ తెలిపింది.

ఎల్16 కెమెరా ధర
ఈ కంపెనీ నుంచి ఎల్16 కెమెరా ఇప్పటికే అమెరికా మార్కెట్లో దుమ్మురేపుతోంది. దీని ధర అక్కడ $1,950 డాలర్లుగా ఉంది. ఈ ధరకు అటూ ఇటూగా 9 కెమెరాలతో ఫోన్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470