స్మార్ట్‌ఫోన్‌ను ల్యాప్‌టాప్‌లా వాడుకోవచ్చా..?

Posted By: Prashanth

స్మార్ట్‌ఫోన్‌ను ల్యాప్‌టాప్‌లా వాడుకోవచ్చా..?

 

అవును మీ స్మార్ట్‌ఫోన్‌ను ల్యాప్‌టాప్‌లా వాడుకోవచ్చు. ఆధునిక సాంకేతితతో ఇది సాధ్యమంటూ క్యూపీ ఆప్టోఎలక్ట్రానిక్స్ (QP Optoelectronics) సంస్థ రుజువుచేసింది. స్మార్ట్‌ఫోన్‌ను ల్యాప్‌టాప్‌లా వాడుకుందామనకునే వారి కోసం ఈ సంస్థ లైట్‌ప్యాడ్(lightpad)పేరుతో ఫోలియో-శైలి పెరిఫెరల్‌ను రూపొందించంది. ఈ పెరిఫెరల్‌లో 11 అంగుళాల స్ర్కీన్‌తో పాటు కీబోర్డ్ అదేవిధంగా ప్రొజెక్టర్ ఉంటుంది. ఈ పరికరాన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేక కేబుల్ ద్వారా లైట్‌ప్యాడ్‌కు అనుసంధానించుకుని ల్యాపీలా ఉపయోగించుకోవచ్చు. ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్ సాయంతో 60 అంగుళాల తెరపై సినిమాలు చూడొచ్చు. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో వేదిక పై ఈ డివైజ్‌ను ఆవిష్కరించారు. ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot